SBI అలెర్ట్ : QR కోడ్ స్కాన్ చేస్తున్నారా? అయితే మీ ఖాతా ఖాళీ?

Purushottham Vinay
QR కోడ్ వల్ల మోసం ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రైజ్ గెలిచారు అనే ఫోన్లు మనకు తరుచుగా వస్తున్నట్లు తెలిసిందే. మీరు గెలిచిన ప్రైజ్‌ను కన్ఫాం చేసుకోవడానికి మీకు వారు QR కోడ్‌ని పంపిస్తాం. దానిని స్కాన్ చేసి ఇంకా ధృవీకరించుకోవాలంటూ మెసేజ్‌లు చేస్తారు. అలా క్యూఆర్ కోడ్‌ని ఎంటర్ చేసి PINతో కన్ఫాం చేయమని చెప్తారు. QR కోడ్‌ను ట్యాంపరింగ్ చేయడం వల్ల వారు దానిని మరొక QR కోడ్‌తో భర్తీ చేస్తారు. ఇక పేరుని మాత్రం అదే విధంగా ఉంచుతారు. చెల్లింపులు చేసేటప్పుడు మీరు శ్రద్ధ కనుక చూపకపోతే, ఆ చెల్లింపు మరొకరికి వెళ్లిపోవడం జరుగుతుంది.

కాబట్టి మోసపోకుండాఖచ్చితంగా జాగ్రత్త వహించాలి..

– ఇలాంటి కాల్స్ వచ్చి ఇంకా క్యూఆర్ కోడ్ కనుక పంపిస్తే మాత్రం జాగ్రత్త వహించాలి. QR కోడ్‌ని అస్సలు స్కాన్ చేయవద్దు. అలాగే డబ్బును స్వీకరించడానికి మీరు ఎప్పుడూ కూడా పాస్‌వర్డ్ లేదా పిన్‌ని నమోదు చేయనవసరం లేదు.

–ఇక చెల్లింపు చేయడానికి, QR కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత, మీరు చెల్లిస్తున్న వ్యక్తి పేరు ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలని ఎస్‌బీఐ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది

– అలాగే చెల్లింపులు చేయడానికి మాత్రమే UPI పిన్ ని నమోదు చేయాలి. ఇంకా చెల్లింపులు స్వీకరించడం కోసం పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది లేదు.

– డబ్బు చెల్లింపులు చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మొబైల్ నంబర్, పేరు ఇంకా అలాగే UPI IDని ఖచ్చితంగా ధృవీకరించండి.

– ఇక పాస్‌వర్డ్ లేదా పిన్‌ను అసలు ఎవరితో కూడా షేర్ చేయవద్దు.

– చెల్లింపులను యాప్‌లో ఇచ్చిన స్కానర్‌తో QR కోడ్‌ని స్కాన్ చేయడం వలన అవి జరగవని ముందుగా తెలుసుకోవాలి.

– ఇక ఏదైనా సమస్య ఉంటే, అధికారిక సమాచారం కోసం వెంటనే సంబంధిత సంస్థల సహాయం అనేది తీసుకోవాలి.

–ఇంకా చెల్లింపు చేస్తున్నప్పుడు ఏదైనా సాంకేతిక సమస్య కనుక ఏర్పడితే. అప్పుడు మీరు సహాయ విభాగానికి వెళ్లి సహాయం అనేది పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sbi

సంబంధిత వార్తలు: