మండలి ఇంకా దూరమే?
ఈ క్రమంలోనే సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ సైతం...తాను పోటీ నుంచి తప్పుకుని, తన తనయుడుని ఎన్నికల బరిలో దింపటానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఇంకా తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యి...తన తనయుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. అవనిగడ్డలో ఎన్నో ఏళ్ల నుంచి మండలి ఫ్యామిలీ రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. దివిసీమ ప్రాంతంలో మండలి వెంకటకృష్ణారావు అనేక ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేశారు.
కృష్ణరావు వారసుడుగా బుద్ధప్రసాద్ సైతం రాజకీయాల్లో రాణించారు..కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు...కానీ రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా నష్టపోవడంతో మండలి..టీడీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో గెలిచి.. ఉపసభాపతిగా పనిచేశారు...ఇక 2019 ఎన్నికల్లో మండలికి ఊహించని విధంగా ఓటమి ఎదురైంది..సింహాద్రి రమేష్ చేతిలో మండలి ఓటమి పాలయ్యారు.
అయితే ఓడిపోయిన దగ్గర నుంచి రాజకీయ పరంగా మండలి పెద్దగా యాక్టివ్గా ఉండటం లేదు..ఏదో తెలుగు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప, రాజకీయ పరమైన అంశాల జోలికి వెళ్ళడం లేదు. ఇదే సమయంలో మండలి వారసుడు వెంకట్రామ్...అవనిగడ్డలో టీడీపీని నడిపిస్తున్నారు...అక్కడ పూర్తిగా పార్టీ బాధ్యతలు వెంకట్రామ్ చూసుకుంటున్నారు..అలాగే వచ్చే ఎన్నికల్లో వెంకట్రామ్ టీడీపీ నుంచి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారని అవనిగడ్డ టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వయసు కూడా మీద పడటంతో మండలి ఇంకా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై..వారసుడుని నెక్స్ట్ ఎన్నికల బరిలో దించేస్తారని తెలుస్తోంది.