ఆ పాము పగబట్టి ఒకే నెలలో ఎన్ని సార్లు కాటేసిందో తెలుసా?

Purushottham Vinay
పాములు ఈ ప్రపంచంలో కెల్ల అత్యంత విషపూరీతమైన ప్రాణులు. కేవలం ఒక్క కాటుతో ఎంతటి బలమైన జీవాలను అయిన క్షణాల్లో చంపేస్తాయి. మనం సినిమాల్లో పాములు జనాల మీద పగ బడటం అనేది చూసి ఉంటాము.అది చూసి పాములేంటి మనుషుల మీద పగ బడటం ఏంటి అని తేలిగ్గా తీసుకొని నవ్వు కుంటూ ఉంటాము కూడా. కాని నిజ జీవితంలో కూడా పాములు పగబడతాయా అంటే ఎవరైనా నమ్ముతారా. కానీ ఈ స్టోరీ విన్నాక నమ్మక తప్పాల్సిందే. గతంలో ఎన్నో సార్లు రుజువైన ఇప్పుడు కూడా అదే మళ్ళీ రిపీటయింది. ఇక అదేంటో తెలుసుకుందాం..

ఇక చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఓ కుటుంబాన్ని ఓ పాము బాగా పగబట్టినట్లు ఉంది. ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులను ఒకే నెలలో ఏకంగా ఆరు సార్లు ఆ పాము కాటేసింది. సకాలంలో స్థానికులు స్పందించి హాస్పిటల్ కు తరలించడంతో ఆ కుటుంబ సభ్యులు దెబ్బకు ప్రాణాలతో బయటపడ్డారు.ఇక సోమవారం నాడు మరోసారి అదే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఆ పాము కాటుకు గురై చికిత్స పొందుతున్నారు. చిత్తూరు జిల్లా లోని చంద్రగిరి మండలం అయిన డోర్ణకంబాల పంచాయతీకి చెందిన వెంకటేష్  ఇంకా అలాగే వెంకటమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ జీవనం సాగిస్తున్నారు.వీరికి ఒక కుమారుడు వున్నాడు. అతని పేరు జగదీష్. ఇక వీరు కుమారుడు జగదీష్ తో పాటు డోర్ణకంబాల గ్రామానికి చివరన గల కొండకింద భాగాన జీవిస్తుంటారు.

అయితే గత నెలలో వెంకటేష్ ఇంకా వెంకటమ్మ అలాగే కుమారుడు జగదీష్ ను రెండేసి సార్లు పాము కాటేయడం అనేది జరిగింది. ఇక స్థానికులు సకాలంలో స్పందించి 108 కాల్ చేసి ఆసుపత్రికి తరలిస్తుంచడంతో ఆ కుటుంబం దెబ్బకు ప్రాణాలతో బయటపడింది. ఆ ప్రాంతంలో వారికి పాముల బెడద చాలా ఎక్కువ ఉన్నప్పటికీ బతుకుదెరువును వదులుకొని వెళ్లలేక అక్కడే వారు తమ జీవనం సాగిస్తున్నారు. ఇక 5 రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంకటమ్మ ఇంకా జగదీష్ లను సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాము కాటేసింది. మళ్లీ స్థానికులు 108కి కాల్ చేసి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి వారికి ఇంకా చికిత్స అందిస్తున్నారు. పాముల బెడద నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు అధికారులని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: