తగ్గేదేలే అంటున్న కేసీఆర్.. నేడు దీక్షకు సిద్ధం?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన చట్టం ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వం పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నేడు నిరసన దీక్ష చేపట్టడానికి రెడీ అవుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. విభజన చట్టంలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా బయ్యారం పరిశ్రమ డిమాండ్ అలాగే ఉండిపోయింది. ఇటీవల మీడియా సమావేశంలో భాగంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ రాదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనం గా మారిపోయింది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు అందరూ అగ్గిమీద గుగ్గిలం అవుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎన్నో బృందాలు సర్వే నిర్వహించడానికి బయ్యారం వచ్చాయి. ఈ క్రమంలోనే పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలం, ఉక్కు రాయి, నీరు విద్యుత్తు రైల్వే లైన్ సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే దానిపై సర్వే నిర్వహించారు పలు బృందాల సభ్యులు. దీంతో ఇక త్వరలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావడం ఖాయమని అనుకున్నారు. కానీ బయ్యారంలో ఉక్కు రాయిలో నాణ్యత లోపం ఉంది అంటూ చెబుతూ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చేతులెత్తేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా ఇప్పటికే కర్మాగారం ఏర్పాటుకోసం నిరసన దీక్షలు చేపట్టగా.. ఇప్పుడు మరోసారి కెసిఆర్ దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.