విజయవాడ : ఐ.వై.ఆర్ కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. బడ్జెట్ ఎలా రూపొందించాలో కేంద్రం బడ్జెట్ చూడండని.. బడ్జెట్ ఎలా రూపొందించకూడదో తెలుసుకోవాలంటే ఎపి రాష్ట్ర బడ్జెట్ ను చూడండని తెలిపారు. ఆదాయం, అప్పులు, నిర్వహణ, జీతభత్యాలు అన్నీ బెరీజు వేసుకుని బడ్జెట్ రూపొందిస్తారని.. ఎపి ప్రభుత్వం బడ్జెట్ లో 37వేల కోట్లు అప్పుగా ప్రతిపాదించారని ఆగ్రహించారు. 57 వేల కోట్లు అప్పుగా తెచ్చి ఒక్క బటన్ తో పెంచేశారని... ఎపి ప్రభుత్వం తీరు చూస్తే బెండు అప్పారావు సినిమా గుర్తు వస్తుందని తెలిపారు. ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చు పెడితే బాగుపడినవాళ్లు లేరని.. అది వ్యక్తి అయినా సంస్థ అయి నా, ప్రభు త్వం అ యినా.. జగ న్ తన సొం త డ బ్బును తె చ్చి పంచడం లేదన ఫైర్ అయ్యారు ఐ.వై.ఆర్ కృష్ణారావు.
రేపు ఈ భారంమొత్తం ఎపి ప్రజలు మోయాల్సిందేనని.. ఎపి బడ్జెట్ కు అసలు పారదర్శకత అనేది లేదన్నారు ఐ.వై.ఆర్ కృష్ణారావు. బడ్జెట్ కి... నిర్వహణ కి అసలు సంబంధమే ఉండటం లేదని.. అయినా ఒక్క బటన్ తో డబ్బులు వేశామంటూ జగన్ ప్రచారమన్నారు. ఆహా, ఓహో అంటూ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో గొప్పలు అని.. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ఎలా అమలు చేస్తారో చెప్పే నిబంధన రావాలన్నారు ఐ.వై.ఆర్ కృష్ణారావు. ఎన్నికల కమిషన్ ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టాలని.. ఇష్టానుసారంగా పంచే విధానానికి స్వస్తి పలకాలని చెప్పారు. గత పాలకులు రియాలిటీ ప్రకారం సంక్షేమ పధకాలు అమలు చేశారని.. నేడు ఎపిలో పూర్తి ఆర్ధిక సంక్షోభం నెలకొందన్నారు ఐ.వై.ఆర్ కృష్ణారావు. దీనిని కాపాడేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని.. ఇప్పుడు అయినా పాలకులు, రాజకీయ పార్టీలు ఆలోచనా తీరు మారాలన్నారు ఐ.వై.ఆర్ కృష్ణారావు.