మరోసారి తెర మీదికి జిన్నా టవర్ వివాదం.. ఏం జరిగిందంటే?

praveen
గుంటూరులో గత కొన్ని రోజుల నుంచి జిన్నా టవర్ వివాదం ఏదో ఒక విషయంలో తెరమీదికి వస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక వివాదం ముగిసిపోయింది అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అంశం జిన్నా టవర్ వద్ద హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది. ఇటీవల జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు వేశారు.. ఇక హోం మంత్రి తో సహా పలువురు హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. దీంతో ఇక జిన్నా టవర్ విషయంలో ఉన్న వివాదం ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని విధంగా గుంటూరులో ఉన్న జిన్నా టవర్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా తొలగించడంతో అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిన్నా టవర్ గా పేరును మారుస్తూ అబ్దుల్ కలాం టవర్ గా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న సమయంలో ఇప్పుడు ఇక అక్కడ ఉన్న జాతీయ జెండాను తొలగించడం సంచలన గా మారిపోయింది. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ జెండా తో పాటు దిమ్మను కూడా తొలగించారు. అయితే ఇది ఎవరు తొలగించారు అన్న దానిపై మాత్రం ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.. ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.



 ఈ క్రమంలోనే ఇక జాతీయ జెండాను తొలగించడంతో మళ్లీ గుంటూరు లో ఎలాంటి వివాదాలు చోటు చేసుకుంటాయో అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.  కాగా దేశ విభజనకు కారణమైన జిన్నా పేరుతో గుంటూరు నడిబొడ్డున స్థూపం ఉండడం ఏంటి అంటూ బీజేపీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. వెంటనే ఇక ఈ స్తూపం యొక్క పేరు మార్చాలని లేదంటే తొలగించాలంటూ బీజేపీ నేతలు గతంలో డిమాండ్ చేశారు.. మున్సిపల్ కమిషనర్ కు దీనికి సంబంధించి వినతి పత్రాలు కూడా అందించారు. అయితే ఇటీవల జిన్నా టవర్ వివాదం పూర్తిగా ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో జాతీయ జెండా తొలగించు మాత్రం మరోసారి వివాదం గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: