భీమ్లా నాయక్ : పొలిటీషియన్స్ పై కౌంటర్స్ ?

Purushottham Vinay
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైన పండగ వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి కలయికలో తాజాగా వచ్చిన బిగ్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా భీమ్లా నాయక్ భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఎవరూ ఊహించని రీతిలో ఉంటాయి అని సమాచారం అయితే చాలా గట్టిగా వినిపిస్తోందనే చెప్పాలి. ఈ సినిమాకు అన్ని వర్గాల మీడియా సంస్థల నుంచి కూడా చాలా పాజిటివ్ రివ్యూలు అనేవి కూడా వచ్చాయి.ఇంకా అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాను చూసిన వారు చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. పేరుకు రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా తెలుగు వారికి నచ్చే విధంగా సినిమాను చాలా అద్భుతంగా తెరపైకి తీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి.



నిజంగా ఈ డైలాగ్స్ అనేవి కేవలం త్రివిక్రమ్ మాత్రమే రాశారా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కావాలని తీసుకు వచ్చారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇక ఇందులో రానాను తిడుతు పవన్ చెప్పే ప్రతి డైలాగ్ ప్రత్యర్థి రాజకీయలకు కౌంటర్ గానే ఉంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలకు కొన్ని డైలాగ్స్ చాలా దగ్గరగా ఉన్నట్లుగా చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా శుక్రవారం వచ్చి సంతకం పెట్టరా నా కొడకా అనే డైలాగ్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతోంది.



ఇక ఈ కౌంటర్ ఎవరికో అనేది అసలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని సోషల్ మీడియాలో చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక వీలైనంత వరకు కూడా అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులు పర్సనల్ విషయాలపై పెద్దగా కామెంట్ చేయరు.కాని ఈ డైలాగ్స్ అనేవి వివాదాస్పదంగా ఉండటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.ఇక కొంతమంది అయితే పవన్ ఎందుకు ఈ మాటలు ఇండైరెక్ట్ గా అనే బదులు డైరెక్ట్ గా అనొచ్చుగా.. అయిన మాటల్లో ఏముంటుంది చేతల్లో చూపించమని పవన్ ని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో అనేది ఇక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: