తెలంగాణ : శుభవార్త.. నిరుద్యోగులకు మెగా జాబ్ మేళా..

Purushottham Vinay
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఇంకా అలాగే తెలంగాణ రాష్ట్ర ట్రెయినింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ సంస్థ(టీస్టెప్) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా ఈరోజు ప్రారంభమవ్వడం అనేది జరిగింది.సికింద్రాబాద్ రాణిగంజ్‌లో ఉన్న యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఈ జాబ్‌ మేళా ను నిర్వహించడం అనేది జరిగింది. ఇక అలాగే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కూడా జరిగే ఈ మెగా జాబ్ మేళాలో మొత్తం కూడా 50 కంపెనీ ప్రతినిధులు హాజరై వారికి అవసరమైన వారిని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక అక్కడ అన్ని కంపెనీలను కలుపుకుని సుమారు 5వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లుగా సమాచారం అనేది తెలుస్తోంది.ఇక సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్ తో పాటు ఫార్మసీ ఇంకా ఎంటర్ టైన్మెంట్ ఇంకా మార్కెటింగ్ ఇంకా అలాగే బిజినెస్ రిలేషన్స్ ఇంకా అలాగే డెలివరీబాయ్స్ ఇంకా అలాగే బిజినెస్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఇంకా అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఇంకా అలాగే కార్పొరేట్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌లలో ఖాళీలను భర్తీ చేసే అవకాశం అనేది ఉంది.



ఇక జీతం విషయానికి కనుక వస్తే వీరికి నెలకు 10వేల నుంచి 30వేల వరకు జీతాలు అనేవి అందజేయనున్నారు. ఇక ఎక్కువ శాతం ఉద్యోగాలు అనేవి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంపెనీలలోనే అందుబాటులో ఉండనున్నాయట. ఇక ఆయా ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వాటిని పూర్తిచేసుకున్న సభ్యులు ఇంకా అలాగే కొత్త వారు ఇంకా అలాగే అనుభవం ఉన్నవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ కల్పించడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం ఈ మెగా జాబ్ మేళాలో ఉద్యోగం కోసం ఎదురు చూసే మీరు కూడా పాల్గొనండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: