‘సీఎం’ పవన్: ముంచుతున్నారుగా!
సరే ఇది మంచి విషయమే...మరి పవన్‌ని సీఎం చేసేందుకు అభిమానులు గాని, జనసేన శ్రేణులు గాని, పోనీ ఆ పార్టీ నాయకులు గాని ఏం చేస్తున్నారంటే? అబ్బే వారు చేసేది ఏమి లేదనే చెప్పొచ్చు...ఏదో హడావిడిగా సీఎం అని అరవడం తప్ప..పవన్‌ని సీఎం చేసే దిశగా మాత్రం పనిచేయరు...అసలు ఏపీలో జనసేనకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? పవన్‌కు సీఎం అయ్యే సత్తా ఉందా? అంటే ఏ మాత్రం లేవనే చెప్పొచ్చు..అసలు ఏపీలో జనసేన పట్టుమని పది సీట్లు గెలుచుకుంటే గొప్ప అని చెప్పొచ్చు.
మరి ఆ బలంతో పవన్‌ని సీఎం చేసేయాలని మాత్రం ఫ్యాన్స్ చూస్తున్నారు...కనీసం తమ సత్తా ఏంటి? రాష్ట్రంలో మనకు ఉన్న బలం ఏంటి అనేది ఆలోచించుకోవడం లేదు..సరే బలం లేకపోయినా సరే...ఇకనుంచైనా బాగా పనిచేసి ప్రజల మద్ధతు పెంచుకుని, ఎన్నికల నాటికి బలపడి అప్పుడు జనసేనని గెలిపించుకుని పవన్‌ని సీఎం చేసే ఉద్దేశంలో ఉన్నారా? అంటే అది లేదు. ఏదో సభలు జరిగినప్పుడు పవన్ ఏమో ఆవేశంగా మాట్లాడేయడం...అంతకంటే ఆవేశంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సీఎం పవన్ అని అరవడం...ఇదే తంతు. ఇలా చేయడంలో వల్ల పవన్‌కు పావలా కూడా ఉపయోగం ఉండదు...ఎప్పుడైతే క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ప్రజల మద్ధతు పొందుతారో అప్పుడే సత్తా చాటే అవకాశం ఉంటుంది..అలా కాకుండా సభల్లో, సోషల్ మీడియాల్లో హడావిడి చేయడం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇకనుంచైనా జనసేన శ్రేణులు ఆ దిశగా పనిచేస్తే బెటర్ అని చెప్పొచ్చు.