పొత్తు లేకుండా బాబు కొత్త ప్లాన్?
అంటే పవన్‌తో కలిసి నెక్స్ట్ ఎన్నికలకు వెళ్లాలని బాబు చూస్తున్నారు...అలా పవన్‌తో కలిసి వెళితేనే..జగన్‌కు చెక్ పెట్టగలమని బాబు భావిస్తున్నారు..అదే ఒంటరిగా బరిలో దిగితే వైసీపీ లాభ పడుతుందని అర్ధమవుతుంది...అందుకే పవన్‌ని కలుపుకోవడం కోసం ట్రై చేస్తున్నారు...కానీ అటు పవన్ వైపు నుంచి పొత్తు గురించి పూర్తి స్థాయిలో మద్ధతు రావడం లేదు..ఏదో ఎన్నికల సమయంలో చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు.
పైగా జనసేన నేతలు ఏమో..పవన్‌కు సీఎం సీటు ఇస్తే..టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని అంటున్నారు..అసలు జనసేన కెపాసిటీ ఏంటి...వారు సీఎం సీటు అడగటం ఏంటని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు...కావాలంటే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లిపోదామని చెబుతున్నారు..ఇదే సమయంలో చంద్రబాబు కూడా ఒంటరిగా పోటీ చేయడానికే సిద్ధమవుతున్నారని తెలుస్తోంది..ఒకవేళ పొత్తు ఉంటే ఓకే...లేదంటే పొత్తు లేకపోతే ఏ విధంగా గెలవాలనే వ్యూహాలని ఇప్పటినుంచే వేసుకుంటున్నారని తెలిసింది..ఎంత కాదు అనుకున్న జనసేన వల్ల టీడీపీకి మాత్రం నష్టం జరుగుతుంది.
సుమారు 20-25 సీట్లలో జనసేన వల్ల నష్టం జరగొచ్చని చంద్రబాబు అంచనా వేస్తున్నారట..అలాగే పలు సర్వేల్లో కూడా ఇదే విషయం తెలిసిందట. ఇక ఈ సీట్లలో డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది..అంటే ఆ స్థానాల్లో టీడీపీ మరింతగా ప్రజా బలం పెంచుకోవాలి...అప్పుడు జనసేన విడిగా పోటీ చేసిన ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. మొత్తానికి జనసేనతో పొత్తు లేకుండా ఎలా గెలవాలనే ప్లాన్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.