మెగా బ్రదర్ నాగబాబు: ఏపీలో సినిమాలు రద్దు?

VAMSI
ఏపీలో థియేటర్ సమస్య సమసిపోయింది కదా అనుకుంటే మళ్ళీ అది మెల్ల మెల్లగా కొందరి వ్యాఖ్యల కారణంగా ఆజ్యం పోసుకుంటోంది. తాజాగా చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి మరియు కొందరు టాలీవుడ్ నుండి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ థియేటర్ టికెట్ల ధరల సమస్యకు ఒక పుల్ స్టాప్ పెట్టారు. దీనితో అటు టాలీవుడ్ కానీ ఇటు ప్రభుత్వం నుండి అందరూ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశం తర్వాత చిరంజీవి మరియు మిగిలిన సభ్యులు మీడియా ముందు ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పారు. అంతే కాకుండా ఫిబ్రవరి నెలాఖరుకు అంతా టాలీవుడ్ శుభవార్త వింటుందని చెప్పారు.

అయితే అప్పటి నుండి ఏపీ ప్రభుత్వం నుండి ఖచ్చితమైన జీవో మాత్రం ఇచ్చింది లేదు. ఈ విషయంపై ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో చిరంజీవి పలు సార్లు మాట్లాడినా ఎందుకు ఇంకా జీవో ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ఎందుకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఏపీ ప్రభుత్వానికి అంత పట్టదు అంటూ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇకపై తెలుగు సినిమా కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని తెలుగు సినిమాలను ఏపీలో విడుదల చేయకుండా నిర్ణయం తీసుకోవాలని నాగబాబు అన్నారు.

అయితే ఇలా చేయడం వలన సినిమా పరిశ్రమకు నష్టం ఏమీ ఉండదని మేము ఎలాగూ ఓటిటి మరియు డిజిటల్ మీడియా ద్వారా మాకు రావాల్సిన డబ్బును రాబట్టుకుంటాము అంటూ ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించాడు. ఏపీ చెబుతున్నట్లుగా సినిమాలను తక్కువ ధరలకు చూపించాలి అనుకుంటే? ఒక్క తెలుగు సినిమానే కాదు... హాలీవుడ్ సినిమాలను కూడా 10 రూపాయలకే చూపించండి అంటూ సవాల్ విసిరారు. ఇదంతా కూడా తెలుగు సినిమా పరిశ్రమను దెబ్బ కొట్టాలని చేస్తున్నారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు అసలుకే మోసం తెస్తాయా అని పలువురు ఆలోచిస్తున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: