ఉక్రెయిన్ అధ్యక్షుడిని చంపేందుకు కుట్ర... ?
దేశాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికులుగా పోరాడడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ముసలి పౌరులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, మహిళలు సైతం గన్ లను చేతబడుతున్నారు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో దారుణమైన పనికి ప్రణాళిక చేస్తున్నారని ఒక అంతర్జాతీయ మీడియా ఛానెల్ చెబుతోంది. రష్యా దాడిని అడ్డుకుంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరియు అతనికి సహకరిస్తున్న మరో 23 మంది ముఖ్యమైన వారిని హతమార్చేందుకు ప్రణాళికను రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే వాగ్నర్ గ్రూప్ అనే మిలీషియా సైన్యాన్ని ఉక్రెయిన్ దేశంలోకి పంపారట.
వీరు తమ ప్లాన్ ప్రకారం అంతా సిద్ధం చేసుకుని ఉన్నారట, కేవలం మాస్కో నుండి పుతిన్ ఆదేశాలు రాగానే, తమ పని పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కాగా ఈ యుద్ధం ఇంకెన్ని రోజుల వరకు జరుగుతుంది అనేది ఒక అంచనా లేదు. కాబట్టి రోజు రోజుకి ఉక్రెయిన్ సైన్యం తగ్గిపోతున్న పరిస్థితుల్లో నాటో కూటమి ఏమైనా సహాయం చేస్తుందా లేదా అమెరికా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.