సునీత వాగ్మూలం ప్రకారం వివేకా కేసులో జగన్ ఏ-1 ముద్దాయి ?

Veldandi Saikiran
అనంతపురం : వైసీపీ పార్టీ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు సంచలన కామెంట్స్ చేసేశారు. మాజీ మంత్రి వర్యులు దివంగత నాయకులు వివేకా నంద రెడ్డి హత్య కేసులో అందరి వేళ్ళు అవినాష్ రెడ్డి వైపు చూపుతున్నాయని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కాల్వ శ్రీనివాసులు.
హత్య జరిగిన మరుక్షణం నుంచే సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించారని మండిపడ్డారు కాల్వ శ్రీనివాసులు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దానిని విపరీతంగా రాజకీయంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాల్వ శ్రీనివాసులు.. వైఎస్ సునీత రెడ్డి తెగించి సహసోపేతంగా ముందుకు వచ్చి సీబీఐ ని ఆశ్రయించిందని మండిపడ్డారు కాల్వ శ్రీనివాసులు. కేంద్రం లో అందరినీ కలిసిందన్నారు కాల్వ శ్రీనివాసులు.విచారణలో అందరి వాంగ్మూలాలు.. అవినాష్ రెడ్డిపై చెప్పారని తెలిపారు కాల్వ శ్రీనివాసులు. వివేకా హత్య కేసులో ప్రధాన కుట్రదారు అవినాష్ రెడ్డి అని తెలుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు కాల్వ శ్రీనివాసులు.. దీనికి ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి  ఏం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాల్వ శ్రీనివాసులు.


చంద్రబాబు ను దోషిగా చూపే ప్రయత్నం చేశారని నిప్పులు చెరిగారు కాల్వ శ్రీనివాసులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్  మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఆరోపణలపై ఎందుకు నిజాలు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు కాల్వ శ్రీనివాసులు.. తెలు కుట్టిన దొంగలా ఉన్నాడు. ఇప్పటికైనా జగన్ మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు కాల్వ శ్రీనివాసులు. రూ.40 లక్షలు సూపరీ ఇచ్చి మాజీ మంత్రి, మాజీ ఎంపీ ని హత్య చేశారంటే దీని వెనుక ఎవరు ఉన్నారని ప్రశ్నించారు కాల్వ శ్రీనివాసులు. అవినాష్ రెడ్డిని ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివకైనా నిజాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు కాల్వ శ్రీనివాసులు.వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రిని సిబిఐ విచారించాలి.... సునీత వాగ్మూలం ప్రకారం ఈ కేసులో జగన్ ఏ-1రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం అయిన జగన్....ఒక హత్య కేసుకు సంబంధించి తెలిసిన నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: