ఉక్రెయిన్ లో కొడుకు కష్టం చూడలేక తల్లి గుండె పగిలింది...

VAMSI
గత వారం రోజుల నుండి ఎటువంటి దయ దాక్షిణ్యాలు లేకుండా రష్యా తన దాడులను ఉక్రెయిన్ పై కొనసాగిస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. మరెందరో నిరాశ్రయులుగా మారిన చిత్రాలను చూస్తే గుండె బరువెక్కిపోతుంది. రోజు రోజుకీ రష్యా తన దాడిని మరింత ఉదృతం చేస్తోంది. ఈ రోజు ఉదయం నుండి అణు ఆయుధాలను ప్రయోగించేందుకు అన్ని విధాలుగా సమాయత్తం అవుతోంది. అణు ఆయుధాలు ప్రయోగిస్తే ఎంతటి విద్వంసం జరుగుతుందో తెలిసిందే. అయితే ఇప్పటి వరకు రష్యా చేత యుద్ధం ఆపించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ యుద్ధం కారణంగా మరో భారతీయ మహిళ అసువులు బాసింది. ఎందరో విద్యార్థుల లాగా తమిళనాడు రాష్ట్రము వేలూరు జిల్లా కొత్తూరు గ్రామం నుండి శక్తి వేల్ ఉక్రెయిన్ లో వైద్య విద్య కోసం వెళ్ళాడు. అయితే యుద్ధం మొదలైన నాటి నుండి తన కుమారుడి యొక్క పరిస్థితిని ప్రతి రోజూ వీడియో కాల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఈ వారం రోజులు తన కొడుకు పడుతున్న కష్టాలను చూసి అమ్మ శశికళ ఎంతో వేదనకు గురయ్యేది. కనీసం ఆహారం కూడా దొరక్క బిక్కు బిక్కుమంటూ ఉన్న తన బిడ్డను చూసి తట్టుకోలేక తన గుండె ఆగి చనిపోయింది.

ఈ వార్త చుట్టు పక్కల వారిని కంటతడి పెట్టించింది అంటే నమ్మండి. అయితే ఈ వార్త గురించి తెలిసిన కొడుకు శక్తివేల్ కన్నీరుమున్నీరు అవుతున్నాడు. కనీసం తల్లిని కడసారి కూడా చూడలేక దుఃఖ సంద్రంలో ఉన్నాడు. ఇంతటి పరిస్థితి శత్రువుకు కూడా రాకూడదు అంటూ ఈ విషయం తెలిసిన వారు అంటున్నారు. ఇక ముందు ముందు ఈ యుద్ధం వలన ఎన్నెన్ని నష్టాలు జరుగుతాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: