రాయలసీమ : వివేకా హత్య కేసులో సీబీఐ, కోర్టులతో పనేలేదా ?

Vijaya




వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, కోర్టుల్లో విచారణ కూడా అవసరం లేదు. ఎందుకంటే వివేకాను హత్యచేసింది కడప ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డే అని టీడీపీ తేల్చేసింది. హత్యకేసు విషయమై చంద్రబాబునాయుడు మాట్లాడుతు వివేకాహత్యలో జగన్మోహన్ రెడ్డే దోషిగా తేల్చేశారు. అలాగే లోకేషేమో కడప ఎంపీ అవినాష్ రెడ్డే వివేకాను హత్య చేసినట్లు చెప్పేశారు. హత్య చేసిందెవరు, కారకుడెవరో తండ్రి, కొడుకులు తేల్చేశారు కాబట్టి ఇక వీళ్ళద్దరికీ శిక్షలు వేయడమే మిగిలింది.





చంద్రబాబు, లోకేష్ చెప్పిందానికి, ఎల్లోమీడియా రాతలకు ఆధారాలు ఏమిటయ్యా అంటే వివేకా కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపణలే. సునీత, నర్రెడ్డి చేసిన ఆరోపణలను పట్టుకుని వివేకాను హత్యకు అవినాష్, జగనే కారణమి ఏ విధంగా నిర్ధారణకు వచ్చారో అర్ధం కావటంలేదు. సీబీఐకి కేసు అప్పగిస్తే ఏమవుతుంది ఇప్పటికే ఉన్న 11 కేసులకు అదనంగా మరోటి కలుస్తుందని తనతో జగన్ చెప్పినట్లు సునీత చెప్పారు. జగన్-సునీత మధ్య నిజంగానే ఇలాంటి సంభాషణ జరిగిందో లేదో సాక్ష్యాలైతే లేవు.





సునీత చెప్పిందాన్ని చంద్రబాబు+లోకేష్+టీడీపీ నేతలు ప్రామాణికంగా తీసుకుని జగన్ పై బురద చల్లేస్తున్నారు. ఇదే సమయంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పాత్రపైన వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మాత్రం టీడీపీ, దానికి మద్దతుగా నిలుస్తున్న మీడియా అస్సలు పట్టించుకోవటంలేదు. వివేకా బతికున్నపుడే ఆయన కుటుంబసభ్యులతో గొడవలు జరిగిన విషయం పులివెందులలో చాలామంది చెప్పుకుంటున్నారు. ఆ విషయాలను మాత్రం టీడీపీ, వాళ్ళ మీడియా కన్వీనియంట్ గా వదిలేస్తున్నారు.






సీబీఐని స్వేచ్చగా దర్యాప్తు చేయనిస్తే వాస్తవాలేంటో బయటపడతాయి. అంతేకాకుండా సీబీఐ దర్యాప్తుకు ప్యారలల్ గా జగన్ వ్యతిరేక మీడియా దర్యాప్తు చేస్తుండటం, వివేకాను హత్యచేసింది అవినాష్ రెడ్డే అని లోకేష్ లాంటి వాళ్ళు ఫైనల్ చేసేస్తే ఎలాగ ?  దర్యాప్తుతో పాటు హంతకులను లోకేష్ టీమే ఫైనల్ చేసేస్తే ఇక సీబీఐ దర్యాప్తు ఎందుకు, కోర్టుల్లో విచారణ ఎందుకు ? కడప ఎంపి టార్గెట్ గా సీబీఐ విచారణ జరుగుతోందని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో చేస్తున్న ఆరోపణలను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలి. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపినపుడే నిజమైన దోషులెవరో తేలుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: