జగన్ పై మేకపాటి వ్యాఖ్యలపై ఏదో తేడా కొడుతోందే...

VAMSI
ఏపీ లో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. ఒక్క ఛాన్స్ అని అడిగ్గానే ప్రజలు అందరూ ఏకాభిప్రాయంతో ఓట్లు వేసి భారీ మెజారిటీతో జగన్ ను గెలిపించి సీఎం కుర్చీలో కూర్చోపెట్టారు. జగన్ మాత్రం అందుకు తగిన విధంగానే మానిఫెస్టోలో చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. అయితే అభివృద్ధి విషయంలో మాత్రం బాగా వెనుకపడుతున్నాడు అన్న విషయాన్ని మాత్రం తానూ తెలుసుకోక, తనతో ఉన్న వారు చెప్పక అందరూ తనను విమర్శించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఏదో ఆలా నిత్యం టీడీపీ మరియు వైసీపీ నాయకులు ఇదే విషయంపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండె పోటు కారణంగా హఠాత్తుగా మరణించారు.

ఇతను సీనియర్ నాయకుడు మరియు మాజీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు అన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మేకపాటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. మేకపాటి మాట్లాడుతూ జగన్ ను అప్పుడు చూస్తుంటే ఇతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అనిపించేదని, అనుకున్నట్లుగానే వైఎస్సార్ మరణం తర్వాత కొత్త పార్టీ పెట్టి బాగా కష్టపడి సీఎం అయ్యాడని పేర్కొన్నారు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు పాడు చేసుకుంటున్నాడు అనిపిస్తోంది అని అన్నారు.

అంతే కాకుండా ప్రజల దగ్గర ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి కానీ వారిని మోసం చేయడం తగదన్నారు. ప్రజలను మోసం చేయాలనుకునే వారు అసలు నాయకులే కారు అని షాక్ ఇచ్చారు. ప్రజలకు దక్కాల్సిన అమౌంట్ ను వారి కోసమే ఖర్చు చేయాలి కానీ, స్వార్ధానికి వాడడం తగదు అని కామెంట్ చేశారు. తన కొడుకు గురించి చెబుతూ తనకు ఎప్పుడూ కష్టపడి ప్రజలకు మంచి చేయాలని చెప్పేవాడినన్నారు. ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఇకనైనా ఏపీ తీరప్రాంతం వెంబడి ఉన్న హర్బర్ లను అభివృద్ధి చేసి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకు రావాలని కోరారు. అయితే జగన్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారో ఎవరికీ అర్ధం కావడం లేదు. మరి చూద్దాం ఏ వ్యాఖ్యలు పార్టీలో చీలికలు తెస్తాయా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: