మేడా మళ్ళీ రూట్ మారుస్తారా?
వచ్చే ఎన్నికల్లో పరిస్తితులు బట్టి నేతలు జంపింగ్‌లు చేయడానికి సిద్ధమవుతున్నారు..ఈ క్రమంలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా డౌట్ డౌట్‌గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు...నెక్స్ట్ ఎన్నికల్లో రాజకీయాలని బట్టి పార్టీ మారడం చేయొచ్చని ఏపీ రాజకీయాల్లో చర్చలు నడుస్తున్నాయి. కాకపోతే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటే..ఆ పార్టీని పెద్దగా ఎవరు వీడరు..ఒకవేళ టీడీపీకి గాని అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటే..ఆ పార్టీలోకి జంప్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అయితే ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారో క్లారిటీ లేదనే చెప్పాలి...ఇదే సమయంలో రాజంపేట మేడా మల్లిఖార్జున్ రెడ్డి సైతం కాస్త డౌట్‌గానే ఉన్నారని చర్చ జరుగుతుంది...ఈయన గత రెండు ఎన్నికల్లో అవసరాన్ని బట్టే పార్టీలు మారిపోయారు. 2012లో కాంగ్రెస్‌లోకి వచ్చి రాజంపేట ఉపఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు...ఇక 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండటంతో..మేడా ఆ పార్టీలోకి వచ్చారు..అలాగే 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి రాజంపేటలో గెలిచారు...ఐదేళ్ల పాటు అధికారాన్ని బాగానే ఉపయోగించుకున్నారు.
ఇక 2019లో వైసీపీకి గెలిచే ఛాన్స్ ఉందని ఊహించి..టీడీపీని వదిలి ఆ పార్టీలోకి వెళ్ళి..2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు...ఎలాగో వైసీపీ అధికారంలోకి రావడంతో మేడాకు బెనిఫిట్ అయింది..మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గాని గెలిచే ఛాన్స్ ఉంటే..ఆ పార్టీలోకి జంప్ అయిపోతారా? అని చెప్పి కడప జిల్లాలో టాక్ నడుస్తోంది. చూడాలి మరి మేడా మళ్ళీ ఏమన్నా రూట్ మారుస్తారేమో.