పవన్ కలిస్తేనే అక్కడ సైకిల్‌కు లీడ్?
కాకపోతే ఛాన్స్ మాత్రమే...అంటే బాబు ఇంకా పుంజుకోవచ్చు.. లేదా వెనక్కి వెళ్లిపోవచ్చు. అయితే ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి..పవన్ కల్యాణ్‌ని కలుపుకుని ముందుకెళితే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందనేది బాబు ఆలోచన...అందుకే పవన్‌తో పొత్తు పెట్టుకోవడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ సైతం పొత్తు పెట్టుకునే దిశగానే ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది..అలా అని ఇప్పటికిప్పుడే పొత్తుపై తేల్చే అవకాశం లేదు. ఎన్నికల ముందే ఈ పొత్తు అంశం తేలేలా ఉంది.
కానీ చంద్రబాబు-పవన్ కలిస్తే మాత్రం జగన్‌కు కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు....అలాగే పవన్ కలిస్తే చాలాచోట్ల టీడీపీ సత్తా చాటే ఛాన్స్ ఉంది. పలు జిల్లాల్లో టీడీపీ మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో కూడా పవన్ సపోర్ట్ చేయడం వల్ల కొన్ని జిల్లాల్లో టీడీపీ సత్తా చాటింది. ఇక నెక్స్ట్ గాని పవన్, బాబుతో కలిస్తే..కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ అదిరిపోయే విజయాన్ని అందుకుంటుందని తెలుస్తోంది.
కృష్ణాలో 16 సీట్లు ఉన్న విషయం తెలిసిందే..గత ఎన్నికల్లో వైసీపీ 14, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. ఈ సారి టీడీపీ-జనసేనలు కలిస్తే వైసీపీకి 3-5 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే టీడీపీ-జనసేన కలిసి 11-13 సీట్లు గెలుచుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు..అంటే పవన్ కలిస్తే మాత్రం కృష్ణాలో టీడీపీ సత్తా చాటడం ఖాయమని క్లియర్ గా అర్ధమవుతుంది.