మూడు రోజుల్లో 39 కోట్లు.. ట్రాఫిక్ పోలీసులు భలే ఐడియా?
ఇక ఇటీవల కాలంలో చలాన్లు కూడా భారీగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇలా ఎంతోమంది చలాన్లు ఉన్నప్పటికీ ఇక వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే వందల కోట్ల పెండింగ్ చలాన్లు అలాగే ఉన్నాయి అని గుర్తించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలోనే వాహనదారులు అందరూ కూడా చలాన్లు కట్టుకునే విధంగా ఎంతో వినూత్నమైన ఆలోచన చేశారు. ఇక పెండింగ్ చలానా కట్టే వారికి రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది పెండింగ్లో ఉన్న చలాన్లు కట్టుకున్నారు అని చెప్పాలి.
గత కొన్ని రోజుల నుండి చూసుకుంటే పెండింగ్లో ఉన్న చలాన్ లపై పోలీసులు ప్రకటించిన రాయితీ కి మంచి స్పందన వస్తుంది అని చెప్పాలి. ఇక తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 39 కోట్లు వసూలు అయినట్లు అధికారులు చెప్పారు. మార్చి 1వ తేదీన 8 లక్షలకు.. రెండవ తేదీన 15 లక్షలు మూడవ తేదీన 16 లక్షల చలాన్లు వాహనదారులు చెల్లించాలంటూ ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పాత పద్ధతిలోనే చలాన్లు విధిస్తాం అంటూ చెబుతున్నారు పోలీసులు. మళ్లీ రాయితీలు ఇస్తారు అనే ఉద్దేశంతో నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.