టికెట్ లేకుండా విమానంలో ప్రయాణం.. బాలుడు తెలివికి షాక్?

praveen
చాలా మంది కుర్రాళ్లు బస్సులు రైళ్లలో ఎలాంటి టికెట్టు తీసుకోకుండానే ప్రయాణించ డానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది అదృష్టం బాగుండి ఎక్కడా దొరక కుండా తమ ప్రయాణాన్ని సాగిస్తే మరికొంతమంది మాత్రం చివరికి అధికారులకు దొరికి భారీ జరిమానా కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఓసారి బస్సు ట్రైన్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేసే ఉంటారు. కానీ ఇక్కడ ఒక బుడ్డోడు మాత్రం ఏకంగా విమానంలో ప్రయాణం చేసాడు. అది కూడా టికెట్ లేకుండా. ఈ ఘటన బ్రెజిల్లో వెలుగులోకి వచ్చింది.


 బ్రెజిల్లో ఇమాన్యుల్ మార్కస్ ఓలివేరా  అనే 9 ఏళ్ల బాలుడు టికెట్ లేకుండా నే విమానంలో ప్రయాణించాడు. అది కూడా ఎక్కడో దగ్గరలో అనుకునేరు. ఏకంగా మూడు వేల కిలోమీటర్ల దూరం టికెట్ లేకుండానే విమానంలో ప్రయాణం చేయడం గమనార్హం. ఓ రోజు అతని తల్లి డేనియల్ మార్క్వేస్ కొడుకుని ఉదయం 5 గంటల సమయంలో చూశాను అంటూ చెప్పారు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడని ఎంతగానో ఆందోళన చెందాం అంటూ చెప్పుకొచ్చారు.



 ఇక ఆ తర్వాత ఏకంగా విమానంలో తమ కొడుకు వెళ్ళాడు అన్న విషయం తెలిసి షాక్ అయ్యాను అంటూ తెలిపారు అతని తల్లిదండ్రులు.  అంతేకాదండోయ్ ఇక అతను విమానం ఎక్కడానికి ముందు గూగుల్ లో టికెట్ లేకుండా ఎవరి కంటా పడకుండా విమానం ఎక్కడం ఎలా అని సెర్చ్ చేసి పూర్తి వివరాలను తెలుసుకొని మరి ఫ్లైట్ ఎక్కాడు. చివరికి బాలుడు ఆచూకీ తెలియడం తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ 9 ఏళ్ల బాలుడు ఎంతో అడ్వాన్సు గా ఆలోచించి టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించడం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక దీనిపై అటు విమానాశ్రయం సిబ్బంది కూడా విచారణ ప్రారంభించడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: