అమరావతి : కోర్టు తీర్పుపై జగన్ వ్యూహమిదేనా ?
తీర్పు మొత్తం విన్న తర్వాత అప్పీలుకు వెళ్ళకుండా ఉంటేనే మంచిదని జగన్ అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాల సమాచారం. హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే సుప్రింకోర్టుకు వెళ్ళినా పెద్దగా ఉపయోగం ఉండదనేది న్యాయనిపుణుల అభిప్రాయం. అందుకనే సుప్రింకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాల్సిన అవసరం లేదన్నారట. ఇదే సమయంలో తమ అజెండా ప్రకారమే తాము ముందుకెళ్ళబోతున్నట్లు కూడా జగన్ అడ్వకేట్ జనరల్ కు చెప్పారట.
తమ అజెండా ప్రకారమే అంటే ఉగాధి నాటికి జగన్ వైజాగ్ కు షిఫ్టవుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే ముఖ్యమంత్రి కార్యాలయం. సీఎం పలానా చోటే కూర్చుని పనిచేయాలని ఎవరు నిర్దేశించలేరు. కాబట్టి జగన్ తనకిష్టమైన వైజాగ్ లో కూర్చునే పాలన చేయబోతున్నారన్నది తాజా సమాచారం. మరి జగన్ వైజాగ్ లో కూర్చుంటే చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు, డీజీపీ కూడా వైజాగ్ వెళ్ళిపోతారు.
కాబట్టి జగన్ అజెండాలో పెద్దగా మార్పులేమీ ఉండవనే అర్ధమవుతోంది. నిజంగానే ఉగాధికి జగన్ వైజాగ్ వెళ్ళిపోతే అప్పుడు ప్రతిపక్షాలు ఎలా రియాక్టవుతాయో చూడాలి. అలాగే జగన్ ఆలోచనలకు భిన్నంగా ఎవరైనా కోర్టుకెక్కే అవకాశం కూడా ఉంది. మరదే జరిగితే అప్పుడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ? అన్నదే ఆసక్తిగా మారింది. అమరావతి డెవలప్మెంట్ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు వాస్తవంగా అమలయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే కోర్టు చెప్పిన పద్దతిలో ఎవరు కూడా ఆదేశాలను అమలుచేయలేరు. చూద్దాం జగన్ వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందో ?