కేసీఆర్ పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు ?
గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల కు నివా ళులు అర్పిం చారు బీజే పీ ఎమ్మె ల్యే లు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. నిర్భంద పాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడారు. ప్రజాసంక్షేమ విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం అన్నారు ఈటెల రాజేందర్. దీనిమీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు. కానీ కెసిఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని నిప్పులు చెరిగారు ఈటెల రాజేందర్. గవర్నర్ గారి కే దిక్కులేకుండా చేస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవుతుందని.. మైకులు కట్ చేసి అవమానిస్తారు. మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో అని ప్రశ్నించారు ఈటెల రాజేందర్, తెలంగాణ ఉద్యమంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు దక్కింది.
మేము ముగ్గురము కావొచ్చు ... కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వం అన్నారు ఈటెల రాజేందర్. రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుందన్నారు ఈటెల రాజేందర్, అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతమని హెచ్చరించారు ఈటెల రాజేందర్,. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు ఈటెల రాజేందర్, కెసిఆర్ గారు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి. లేదంటే రేపు మీకు కూడా అదే గతి పడుతుంది..రా జ్యాంగానికి విరుద్ధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈటెల రాజేందర్,. గవర్నర్ ర్ కి విలువ ఇవ్వడం లేదు.. మహిళ గవర్నర్ అని కూడా చూడటం లేదు... ప్రభుత్వ వ్యతిరేకత తోనే భాజపా నుంచి గెలిచిన ఇద్దరూ శాసనసభ్యులను ప్రజలు గెలిపించారన్నారు ఈటెల రాజేందర్,