పార్టీ లేదా అనిల్ ! హమ్మయ్య జగనన్న సేఫ్
ఏపీ లో జగన్ ను ఢీకొనే శక్తి ఉన్నా లేకున్నా చాలా మంది పార్టీలు పెట్టే ఆశలు మాత్రం బాగానే పెంచుకుంటున్నారు.ఆ విధంగా షర్మిల కూడా ఇక్కడ పార్టీ పెట్టే యోచన ఉందని గతంలో అన్నా,ఆ గతాన్నీ ఆ మాటనీ అన్నింటినీ మరిచిపోవడం తన విధి అన్న విధంగా ఉన్నారు.అన్నను ఎదిరించే శక్తి లేక, అలా అని అసహాయత వ్యక్తం చేయలేక అవస్థ పడుతున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబాల్లో వర్గ పోరు బాగానే ఉంది. ఓ వైపు వైఎస్ వివేకా కూతురు సునీత మరోవైపు షర్మిల అన్నను బాగానే ఇబ్బందుల పాల్జేస్తున్నారు.ఈ క్రమంలో ఎటు వెళ్లాలో తేల్చుకోలేని వారంతా అటు ఇటు కాక సతమతం అవుతున్నారు.ఇరు కుటుంబాలకూ చెందిన వారూ ఇదే విధంగా ఎవ్వరికీ సర్ది చెప్పలేక ఇక్కట్లలో ఉన్నారు.ఈ దశలో కొత్త పార్టీ ఊసు ఒకటి వినిపించనుందని ఈ రోజు ఉదయం నుంచి ఛానెళ్లు ఊదరగొట్టాయి. కానీ అటువంటి పరిణామాలేవీ జరగకుండానే ఈ రోజు ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీ పెట్టే యోచనే లేదని తేల్చేశారు బ్రదర్ అనిల్ ..దీంతో రాజకీయ వర్గాలన్నీ ఒక్కసారిగా ఉస్సూరుమన్నాయి. అయితే క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో మాట్లాడిన అనిల్ కు కొన్ని సందేహాలు మాత్రం తప్పక కలిగి ఉంటాయి.ఆంధ్రావనిలోఅటు బీసీలు కానీ ఇటు దళిత వర్గాలు కానీ ఇంకా చెప్పాలంటే మైనార్టీ,క్రిస్టియన్ వర్గాలు కానీ ఏవీ అంత ఆనందంగా లేవన్నది ఓ సత్యం సంబంధిత సందేహం అన్నీ రేగే ఉండాలి.అవే ఆయన దృష్టికి సంబంధిత వర్గాలు తీసుకువెళ్లారు.అందుకే జగన్ పై పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడని అనిల్ తొలిసారి ఆ మాత్రం అయినా పెదవి విప్పారు.ఇప్పట్లో పార్టీ లేదని చెప్పినా మిగిలిన విషయాలపై మాత్రం మూగనోము వీడారు.
ఇక బ్రదర్ అనిల్ పార్టీ లేదన్న విషయం తేల్చేయడంతో వైసీపీ వర్గాలు ఇప్పటికిప్పుడు ఆనందంగా ఉన్నా రేపటి వేళ సంబంధిత వర్గాల సమస్యలు తీర్చకుంటే ఓటు బ్యాంకు రాజకీయాలు బెడిసికొట్టే అవకాశాలు కొట్టిపారేయలేం.అందుకు బ్రదర్ అనిల్ బాధ్యుడు కారు.కాబోరు కానీ జగన్ మాత్రం తప్పకుండా అన్నింటికీ బాధ్యత వహించాల్సిందే.ఇప్పటికే మైనార్టీ వర్గాలకు జగన్ చేసిందేం లేదని తేలిపోయింది.అదేవిధంగా క్రీస్టియన్ వర్గాలకూ ఏం చేశారు అన్న ప్రశ్న వస్తోంది.