తెలంగాణ బడ్జెట్ పూర్తి వివరాలివే?

frame తెలంగాణ బడ్జెట్ పూర్తి వివరాలివే?

VAMSI
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. 2022-23 వార్షిక బడ్జెట్ కోసం తెలంగాణ ప్రభుత్వం 2,56,958.51 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ సెషన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై లేకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినా బడ్జెట్ మాత్రం ఆగలేదు. దీనిని కూడా ప్రతిపక్షాలు వివాదం చేసేందుకు ప్రయత్నించాయి. అయితే ఈ బడ్జెట్ లో ప్రధానంగా ఏమి ఉన్నాయి? ఎవరికి ప్రయోజనం చేకూరింది అన్న విషయాల గురించి ఒకసారి చూద్దాం.
కేసీఆర్ సర్కారు ఎంతో అలోచించి నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని గుర్తించి చదువుకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యతను కల్పించింది. ఇందులో భాగంగా మన ఊరు - మన బడి కొరకు భారీ మొత్తం లో 3497 కోట్లు కేటాయించారు. ఈ సారి రాష్ట్రంలో మొదటి సారిగా మహిళ విశ్వవిద్యాలయం మరియు అటవీ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనుంది. దీని కోసం రెండింటి కోసం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం.
ఇక కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన దళిత బంధు పథకానికి 17,700 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అయితే గత బడ్జెట్ లో ఈ పథకం కోసం కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈ సారి దాదాపు 75 శాతం వరకు పెంచారు. గత సంవత్సరం హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈ దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి ప్రయోజనం చేకూరేలా చేయాలన్నది ప్రభుత్వం ఆశయం అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రస్తుతం వరకు ఈ పథకం ద్వారా 11 వేల 800 కుటుంబాలకు ప్రయోజనం అందుతోంది.
ఇక దేశానికి వెన్నెముక అయిన గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం నెలకు 227.5 కోట్లు కేటాయించారు. అదే విధంగా పట్టణాల అభివృద్ధికి 1394 కోట్లు బడ్జెట్ లో పెట్టడం జరిగింది.
ఇక ఎన్ని పధకాలు ఎన్ని రాయితీలు ఇచ్చిన బాగు పడని రైతుల వ్యవసాయం కోసం 24254 కోట్లు, ఇరిగేషన్ శాఖ కోసం 22675 కోట్లు కేటాయించారు. మిగతావి కూడా గత బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని కేటాయించడం జరిగింది.
* హరిత హారం - 932 కోట్లు
* 205 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కోసం - 1000 కోట్లు
* పోలీస్ శాఖ - 9315 కోట్లు
* కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ పథకాలకు - 2750 కోట్లు
* ఆసరా కోసం - 11728 కోట్లు.
* డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు - 12 వేల కోట్లు
* గిరిజన సంక్షేమం - 12, 565 కోట్లు
* బీసీ సంక్షేమం - 5698 కోట్లు
* బ్రాహ్మణ సంక్షేమం - 117 కోట్లు
* ఆర్ అండ్ బి - 1,542 కోట్లు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: