అక్బరుద్దీన్ ఒవైసి: "ముస్లిం"లకు కేసీఆర్ చేసిందేంటి?
అయితే ఓ వైపు తెరాస పార్టీని విమర్శిస్తూనే మరో వైపు తదుపరి ప్రభుత్వం కూడా తెరాస పార్టీదే అని వారితో కలిసి పనిచేస్తాము అని అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంటే తెరాస పార్టీకి చేదోడు వాదోడుగా నిలబడుతూ రానున్న ఎన్నికలకు వ్యూహ రచన జరుగుతుందా అంటూ పలు ప్రత్యర్ధి పార్టీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
అసెంబ్లీ లో అక్బరుద్దీన్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి పరిపూర్ణ న్యాయం చేశామంటూ అధికార పార్టీ బాగానే చెబుతోంది. కానీ ముస్లిం సోదరులకు మాత్రం ఒక్క రూపాయి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరగలేదని వాపోయారు.
ప్రజలకు మేలు చేశారు కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ...రానున్న ఎన్నికల్లో సైతం తెరాస ప్రభుత్వమే వస్తుందని, వారితో తమ పార్టీ కలిసి ముందుకు సాగుతుంది అని వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇంతకీ అక్బరుద్దీన్ ఏమి మాట్లాడాలని అనుకున్నారు ? చివరికి ఏమి మాట్లాడారు అని విపక్షాలు ఆయనపై సెటైర్లు వేసుకుంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ నిరుద్యోగ భర్తీలకు సంబంధించిన వార్త ఎంత వరకు ప్రజలకు సంతృప్తిని ఇస్తుంది అనేది తెలియాలంటే సంబంధిత నోటిఫికేషన్ లు వచ్చే వరకు ఆగాల్సిందే.