రాష్ట్రంలో పెరిగిన బైక్ యాక్సిడెంట్ లు... జాగ్రత్త సుమీ ?

VAMSI
ఒక యాక్సిడెంట్ లో జరిగే ప్రాణ నష్టం జీవితాలనే తారుమారు చేస్తుంది. ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. అతి వేగమే ఎక్కువగా యాక్సిడెంట్లు కు కారణమౌతుంది. నిత్యం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 సంవత్సరం తో పోలిస్తే 2021 లో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు పెరిగాయని అధికారులు తెలిపారు. 2020 సంవత్సరం తో పోలిస్తే గత ఏడాది 2021 రోడ్డు ప్రమాదాలు గణనీయంగా 14% శాతం పెరిగాయి. పోయిన సంవత్సరం 19,729 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాగా అందులో 8,053 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ప్రమాదాలలో 21,169 మంది గాయాల పాలయ్యారు.

ఈ యాక్సిడెంట్ లలో అధికంగా బైక్ యాక్సిడెంట్లు ఉండడం గమనార్హం. అతి వేగంతో బండ్లు నడపడం వలనే ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగాయి.  ఆంధ్ర రాష్ట్రం లో జిల్లాల వారీగా చూస్తే విశాఖలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. విశాఖలో 2,344 ప్రమాదాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ తరువాత స్థానంలో  తూర్పుగోదావరి జిల్లా ఉంది. ఈ జిల్లాలో 2,192 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ కూడా అతివేగం కారణం గానే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. కాలం విలువైనదే ప్రాణం అంతకన్నా విలువైనది. ఇది వాక్యం కాదు మన జీవితానికి మూలమైన సూత్రం. ఏ పనికైనా ఒక పది నిముషాలు లేట్ అయిపోతే కొంపలేమి మునిగిపోవు.

కానీ...వేగంగా బండి నడపడం వలన దుదృష్టవశాత్తు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ప్రాణం తిరిగి వస్తుందా ? ఆ కుటుంబాలకు జరిగిన నష్టం వెలకట్టగలమా ? ఆ నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యమా ? ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రాణాలను కాపాడుకోండి. ఈ వార్తను ప్రతి ఒక్కరూ చదివి తమ కుటుంబం గురించి శ్రద్దగా అలోచించి వచ్చే సంవత్సరం యాక్సిడెంట్ ల రెకార్డ్ చూస్తే భారీగా తగ్గిపోవాలి. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. "అతివేగం ప్రమాదకరం"

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: