యూపీ విజేతను తేల్చేసిన అఖిలేష్.. ఎవరో తెలుసా..!

MOHAN BABU
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. యూపీలో ప్రతి ఐదేళ్లకు అధికార మార్పిడి జరుగుతుంది. ఈసారి బిజెపి ప్లేస్ లో ఎస్పి అధికారంలోకి వస్తుందని భావించారు. ఐదేళ్ల బిజెపి పాలన మీద వ్యతిరేకత ఉందన్న వార్తలు వచ్చాయి. యోగి చరిష్మా, మోడీ మ్యాజిక్ రెండూ కూడా ఈసారి యుపి ఎన్నికల్లో పని చేయమని కూడా చాలామంది రాజకీయ మేధావులు జోస్యం చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్ చూస్తే  దాదాపుగా 99% బిజెపినే గెలుస్తుందని తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో అపోజిషన్ పార్టీ తమదే గెలుపు అని ఫుల్ కాన్ఫరెన్స్ లో ఉన్నా ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ అయితే వీటిని చూసి పరేషాన్ అయ్యారు. ఆ ఎగ్జిట్ పోల్స్ పక్కా బోగస్..

 ఎగ్జాక్ట్ రిజల్ట్ లో మాదే విజయమని  చెప్పుకొస్తూ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. తీరా 24 గంటలు కాకముందే అనూహ్య కామెంట్స్ చేశారు. ఈవిఎం లను బీజేపీ మేనేజ్ చేసిందని ఆయన చెప్పడం విశేషం. ఇది నిజంగా సంచలన ఆరోపనే. రిజల్ట్స్ కి ఇంకా ఒక్క రోజు మాత్రమే వ్యవధి ఉన్నవేళ అఖిలేష్ ఇలా మాట్లాడటం అంటే కచ్చితంగా ఎస్పీ ఓడిపోతుందని ఆయన ఒప్పేసుకున్నరా అన్నదే చర్చ గా ఉంది. బలమైన ప్రత్యర్థిగా ఉన్న ఎస్పీ ఎప్పుడైతే ఈ తరహా ఆరోపణలు చేస్తోందో అవి ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఇంకా అసలు రిజల్ట్స్ అని బయట పెట్టేస్తున్నాయని అంటున్నారు. నిజానికి ఎస్పి టఫ్ ఫైట్ ఇచ్చింది. ఒక దశలో చూస్తే మార్చి 10 నుంచి అంతా అఖిలేష్ రాజ్యమే అని అన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన ఒక్కరోజు తేడాలో అఖిలేష్ ఇలా మాట్లాడటం చూస్తే ఎక్కడో తేడా కొడుతుంది అని ఎస్పీ పెద్దలు తలచి ఉండాలి.

అయినా కూడా యూపీ ఎన్నికలు ఏడు విడతలుగా దాదాపు నెల రోజులపాటు జరిగాయి. ఒకవేళ ఈవీఎంలను మేనేజ్ చేయడం అంటే తొలి విడత లోనో,రెండో విడత లోనో ఈ ఆరోపణలు ఎందుకు చేయలేదు అనే చర్చ కూడా వస్తుంది. అంటే మొత్తం పోలింగ్ శాలను సమీక్షించుకున్న తర్వాతే తమకు విజయావకాశాలు తక్కువ అని ఎస్పీ నేతలు గ్రహించాలని అంటున్నారు. మరి యూపీలో ఎలాంటి ఫలితం వస్తుంది అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: