కేసీఆర్ సారూ... షర్మిలక్క ఏమంటోంది జర చూడరాదే?

VAMSI
" data-original-embed="" >

దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు వై ఎస్ షర్మిల తెలంగాణ లో నూతన పార్టీ తో ఫుల్ యాక్టీవ్ గా వుంటున్న విషయం తెలిసిందే. ప్రజలకు మద్దతుగా నిలుస్తూ వారి వైపు నుండి గలమెత్తుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లోనూ ఈమె ఎప్పుడూ ముందే ఉంటారు. ఇపుడు మరో సారి ప్రజల వైపు నుండి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. అధికార పార్టీకి అబద్ధాలు చెబుతూ కాలయాపన చేయడం పరిపాటి అయిపోయింది అని ప్రజల్ని మభ్యపెట్టకుండా న్యాయం జరిగేలా చూడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ రోజు తెలంగాణ సిఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తాజాగా ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల.

ఇంతకీ ఆమె ఏమన్నారు అంటే..!! మేము పార్టీ పెట్టాక కాదు పార్టీ పెట్టక ముందు నుండే నిరుద్యోగులకు అండగా నిలబడి వారికి మద్దతు పలుకుతూ న్యాయం జరగడం కోసం మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశామన్న విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ పెట్టాక 17 వారాల పాటు నిరంకుశంగా నిరాహార దీక్ష చేస్తే కానీ పార్టీలకు స్పృహ రాలేదని, ఆ దీక్ష తరువాతే అధికార పార్టీకి బుద్ది వచ్చింది అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేనా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న మీరు ఇపుడు మళ్ళీ అదే బాటలో మరో అబద్దం చెప్పారంటూ వాపోయారు.

మొత్తం 91వేల ఉద్యోగాలు ఖాళీలు ఉండగా వాటిలో కేవలం 80వేల ఉద్యోగాలే ఉన్నాయని వాటిని భర్తీ చేస్తామని కేసీఆర్ అనడంలో అర్దం లేదని ఫైర్ అయ్యారు. కనీసం చెప్పిన వాటికి అయినా భర్తీ చేస్తారు అనే గ్యారెంటీ లేదంటే అభిప్రాయపడ్డారు. నోటిఫికేషన్లు ఇస్తే సరిపోదు, వాటిని ఖచ్చితంగా భర్తీ చేయాలి. అలాగే మిగిలిన ఖాళీలు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేస్తే తప్పితే మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈమె మాటల సారాంశం చివరగా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ విషయంలో విజయం నాదే అంటూ సొంత డబ్బా కొట్టుకున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: