రూ. 50 పెరిగిన పెట్రోల్ ధర... ఎక్కడో తెలుసా?

VAMSI
రష్యా మరియు ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న ఈ అనవసరమైన యుద్ధం కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్న తీరు పట్ల అందరూ ఆగ్రహంగా ఉన్నారు. ప్రపంచ దేశాలు అన్నీ రష్యాపై చాలా కోపముగా ఉన్నాయి, ఇప్పటికే రష్యాపై అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, చైనా లాంటి దేశాలు ఆర్ధిక పరమైన ఆంక్షలు విధించాయి. అయినప్పటీకే ఏమాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ లోకి చొచ్చుకుపోతున్నాడు. ఈ రోజుకి యుద్ధం మొదలై రెండు వారాలు పూర్తయ్యి మూడవ వారం లోకి అడుగు పెట్టాము. అయితే ఇతర దేశాలకు ఈ యుద్ధం కారణంగా నష్టమో లాభమో తెలియదు కానీ... ఇండియాకు మాత్రం చాలా నష్టం వాటిల్లింది.

ఈ యుద్ధం వలన పెట్రోల్ డీజల్ ధరలు పెరుగుతాయని రోజుకో వార్త వస్తూ సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక వంట నూనెల ధరలు అయితే, పెరుగుతాయి అని వార్త వచ్చిన దానికే వ్యాపారులు వారికి వారే పెంచుకుని ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. కాగా తాజాగా ఒక అణుబాంబు లాంటి వార్త అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
మన పక్క దేశం అయిన శ్రీలంక పై కూడా ఈ యుద్ధం యొక్క ప్రభావం పడింది. ఇక్కడ ఎవ్వరూ ఊహించని రీతిలో చమురు ధరలు పెరగడం వలన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. అసలు ఈ ధరలు చూస్తే ఇండియాలో ఒక్కరికి కూడా నోరు మెదపదు, అంతలా పెరిగాయి.

చమురు ధరలు పెరిగిన తర్వాత ఒక లీటర్ పెట్రోల్ రూ. 50 పెరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా లీటర్ డీజెల్ ధర రూ. 75 పెరిగింది. ఈ విషయాన్ని LIOC అధికారికంగా ప్రకటించింది. పెరిగిన ధరలతో శ్రీలంక లో ప్రస్తుతం పెట్రోల్ రూ. 254 మరియు డీజిల్ రూ. 214 అయింది. అయితే అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరల కారణంగా ఇంత మొత్తంలో ధరలు పెంచినా నష్టాలు వస్తున్నట్లు LIOC తెలిపింది. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: