కావలిలో కొత్త ట్విస్ట్: ఈ సారి సైకిల్ సవారీ ఉంటుందా?

M N Amaleswara rao
వైసీపీ కంచుకోటల్లో తెలుగుదేశం పార్టీ దూకుడు పెరుగుతుంది..ఈ సారి ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ నేతలు తెగ కష్టపడుతున్నారు...తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలే కాకుండా..వైసీపీకి అనుకూలంగా ఉన్న స్థానాల్లో కూడా పాగా వేయాలని టీడీపీ చూస్తుంది..ఇదే క్రమంలో వైసీపీకి కంచుకోటగా ఉన్న కావలిపై టీడీపీ ఫోకస్ చేసింది. మొన్నటివరకు ఇక్కడ సరైన నాయకుడు లేకపోవడం వల్ల టీడీపీకి మైనస్ అయింది..కానీ ఇటీవలే మాలెపాటి సుబ్బానాయుడుని ఇంచార్జ్ గా పెట్టారు.

ఇక ఇంచార్జ్ పదవి తీసుకున్నాక సుబ్బానాయుడు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు...కావలిలో ఉన్న ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు...సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు నియోజకవ్గర్గంలో పర్యటిస్తూ...ప్రజల సమస్యలని తెలుసుకుంటున్నారు. సుబ్బానాయుడు ఎంట్రీతో కావలిలో టీడీపీకి కాస్త ఊపు వచ్చింది. అయితే గత ఎన్నికల తర్వాత కావలిలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైన విషయం తెలిసిందే.

మామూలుగానే కావలిలో టీడీపీకి పెద్ద బలం లేదు..ఎప్పుడో 1983లో ఒకసారి, తర్వాత 1999, నెక్స్ట్ 2009 ఎన్నికల్లోనే అక్కడ టీడీపీ గెలిచింది. గత రెండు ఎన్నికల్లోనే ఓడిపోతూనే వస్తుంది...ఇక గత ఎన్నికల్లో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు...ఓడిపోయాక ఆయన పార్టీని పట్టించుకోవడం లేదు..అటు సీనియర్ నేత బీదా మస్తాన్ రావు టీడీపీని వదిలి వైసీపీలో చేరిపోయారు..దీంతో కావలిలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైంది..ఈ క్రమంలోనే కావలి ఇంచార్జ్ గా బీదా రవిచంద్రకు బాధ్యతలు ఇవ్వాలని బాబు భావించారు..కానీ రవి మాత్రం పదవి తీసుకోలేదు.

ఈ క్రమంలోనే రవిచంద్ర సపోర్ట్ ఉన్న మాలెపాటి సుబ్బానాయుడుకు ఇంచార్జ్ పదవి దక్కింది. పదవి దక్కించుకున్న తర్వాత ఆయన దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు...మళ్ళీ కావలిలో టీడీపీ జెండా ఎగరవేసే దిశగా ముందుకెళుతున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీపై బాగా వ్యతిరేకత పెరిగితే..కావలిలో టీడీపీకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి..చూడాలి మరి కావలిలో ఈ సారైనా సైకిల్ సవారీ ఉంటుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: