గాజువాక సీటుపై కన్ఫ్యూజన్..పవన్ క్లారిటీ ఇచ్చేస్తారా?

M N Amaleswara rao
విశాఖపట్నంలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గాజువాక సీటు అనే చెప్పాలి..2019 ఎన్నికల ముందు వరకు అన్ని స్థానాలతో పాటు ఇది కూడా ఒకటి...కానీ ఎప్పుడైతే అక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేశారో, అప్పటినుంచి అందరి దృష్టి దానిపైనే పడింది..అయితే అనూహ్యంగా ఆ స్థానంలో పవన్ ఓడిపోయారు...ఇక ఎన్నికలు అయిపోయాయి..గాజువాకలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో గాజువాకపై పెద్దగా ఫోకస్ ఉండదని అనుకోవడానికి లేదు.
ఇప్పటికీ గాజువాక సీటుపై అన్నీ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి..ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ పవన్, గాజువాక బరిలో దిగే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతుంది..అందుకే ఇప్పటివరకు అక్కడ జనసేన తరుపున ఇంచార్జ్ కూడా పెట్టలేదని అంటున్నారు. అలా అని గాజువాకలోనే పవన్ పోటీ చేస్తారనే క్లారిటీ లేదు...ఇప్పటికే ఆయన మళ్ళీ భీమవరంలో పోటీకి దిగుతారని, కానీ గాజువాకలో పోటీ చేయరని ఓ వైపు ప్రచారం జరుగుతుంది.
అదే సమయంలో ఒకసారి తిరుపతి నుంచి పోటీ చేస్తారని, మరొకసారి కాకినాడ రూరల్ లేదా సిటీ నుంచి బరిలో దిగుతారని కథనాలు వస్తున్నాయి. కథనాలు వస్తున్నాయి గాని, పవన్ ఎక్కడ పోటీ చేస్తారో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఒకవేళ ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ ఇవ్వకపోయిన..పోటీ చేయని స్థానాలపై క్లారిటీ ఇస్తే బాగానే ఉంటుంది.
గాజువాకలో పోటీ చేయరని అనుకుంటే అక్కడ వేరే నాయకుడుకు బాధ్యతలు ఇస్తే..జనసేనకు ప్లస్ అవుతుంది. అలా కాకుండా ఎన్నికల వరకు నానుస్తూ కూర్చుంటే పార్టీకి నష్టం. అదే సమయంలో నెక్స్ట్ గాని టీడీపీతో పొత్తు ఉంటే...గాజువాక సీటు టీడీపీకి దక్కుతుందా? లేక జనసేనకు దక్కుతుందో క్లారిటీ రావడం లేదు.
పవన్ మినహా గాజువాక జనసేనలో బలమైన నాయకుడు లేరు...అంటే పవన్ పోటీ చేస్తే ఓకే, లేదంటే ఆ సీటు టీడీపీ కావాలని పట్టుబట్టే ఛాన్స్ ఉంది..కాబట్టి గాజువాక సీటులో కన్ఫ్యూజన్ లేకుండా పవన్ క్లారిటీ ఇస్తే బెటర్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: