ఏపీలో ముందస్తు ఎన్నికలు.. సజ్జల ఏమన్నారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్యమైన పరిణామాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఏపీ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల కీలక నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉండటం చూస్తే ముందస్తు ఎన్నికలు ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవల టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయ్ అన్నదానికి మరింత ఊతం ఇచ్చింది అని చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ పాలనాపరంగా కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు స్థానచలనం చేశారు అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ పైన కూడా సంకేతాలు ఇవ్వడం గమనార్హం.



 ఇక ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కోసం పార్టీని సిద్ధం చేసే కార్యాచరణను సీఎం జగన్ అమలు చేస్తున్నారని ప్రచారం మొదలైంది అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం ముందుగానే పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాలని డిసైడ్ అయిపోయాడు అంటూ మరికొంతమంది చర్చించుకుంటున్నారు.. అదే సమయంలో జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాడు అంటూ టీడీపీ పదే పదే వ్యాఖ్యానిస్తూ ఉండటం చూస్తూ ఉంటే ఇది నిజమే అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇటీవల ఇదే విషయంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ప్రస్తుతం ఏముంది అంటూ ప్రశ్నించారు. పార్టీ నేతలు ఎవరు ఆయనకు తాటాకు కూడా దొరకడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఇక పార్టీ నేతలు అందరికీ కూడా ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి మభ్య పెట్టి వారిని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు సరికొత్త డ్రామాలు ఆడుతున్నడని ఇక ఇప్పుడు ముందస్తు ఎన్నికల ప్రచారం చేయడం కూడా అలాంటిదే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యేలు నేతలు కూడా జగన్ వైపు చూస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఇక ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేవారికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని తమ ప్రభుత్వానికి లేదని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.



 ఇక జగన్ నిర్వహిస్తున్న పథకాలు కార్యక్రమాలకు సమయం సరిపోవడం లేదు. ఐదేళ్లు ప్రజలు జగన్కు పదవీకాలం ఇచ్చారు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ పైన కూడా స్పందించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రెండున్నరేళ్ల కొకసారి ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారు.. త్వరలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉంది. పార్టీ బలోపేతం ప్రభుత్వ పాలన రెండు మాకు ముఖ్యమే  అంటూ ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: