కన్ఫ్యూజన్‌లో కల్యాణ్ ‘బాబు’?

M N Amaleswara rao
ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి అనేక రకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..ఎప్పటినుంచో టీడీపీ-జనసేన పొత్తు గురించి పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని వైసీపీతో తలపడతాయని విశ్లేషణలు వస్తున్నాయి...అయితే విశ్లేషణలే కాదు...అటు టీడీపీ, ఇటు జనసేనలో కూడా పొత్తు గురించి చర్చలు నడుస్తున్నాయి..ఇప్పటికే టీడీపీ పొత్తు కోసం ఎదురుచూస్తుంది..జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ సిద్ధంగానే ఉంది...చంద్రబాబు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసిన విషయం తెలిసిందే...ఇక క్లారిటీ ఇవ్వాల్సింది పవన్ కల్యాణ్ మాత్రమే..ఆయన ఇప్పుడే పొత్తు గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.


ఇప్పటికే జనసేన నేతలకు పొత్తు గురించి మాట్లాడవద్దని, పార్టీ బలోపేతం గురించి చూసుకోవాలని సూచనలు చేసిన విషయం తెలిసిందే...అయితే పొత్తు గురించి ఎన్నికల ముందు బయటపడే అవకాశం ఉంది..కాకపోతే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప్లస్ అవుతుందనే భావన పవన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది...కానీ ఇప్పుడు బీజేపీతో కలిసి ముందుకెళ్లే విషయంలో పవన్ క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంది.

గత ఎన్నికల తర్వాత పవన్...కమ్యూనిస్టు పార్టీలకు హ్యాండ్ ఇచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే...పేరుకే పొత్తు గాని ఈ రెండు పార్టీలు పెద్దగా కలిసికట్టుగా రాజకీయం చేసినట్లు కనిపించలేదు...కొద్దో గొప్పో జనసేన, టీడీపీతో కలిసే ముందుకెళ్లింది. ఈ అంశం బీజేపీకి నచ్చడం లేదు..పైగా బీజేపీ, టీడీపీతో కలవడానికి ఒప్పుకోవడం లేదు..చంద్రబాబుని మళ్ళీ నమ్మే పరిస్తితి లేదని చెప్పేస్తున్నారు. దీంతో పవన్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీని వదిలేయాల్సిన పరిస్తితి...అలా అని జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీని వదిలేస్తే రాజకీయంగా ఏమన్నా ఇబ్బందులు వస్తాయనేది పవన్ ఆలోచించుకుంటున్నట్లు తెలుస్తోంది.

పైగా తాజాగా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది..ఈ పరిణామాలని దృష్టిలో పెట్టుకుని పవన్ పొత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మరి పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్  పొత్తుపై ఏదైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: