ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఏ ఇద్దరి నోట నుంచి విన్నా కూడా ఎక్కువగా ఇదే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే రష్యాకు చెందిన మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.ఇక రష్యాలో పిజ్జా బర్గర్ బ్రెడ్ లాంటి వాటిని చాలా ఎక్కువగా తింటారు.అయితే వరల్డ్ ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో రారాజు అయిన మెక్ డోనాల్డ్స్ రష్యాలో తన కార్యకలపాలను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.సుమారు దేశంలో ఉండే 850 రెస్టారెంట్లను షట్ డౌన్ చేసేందుకు డెసిషన్ తీసుకుంది. ఇక దీనికి సంబంధించిన ప్రకటనను కూడా ఇచ్చింది. అయితే ఇక ఈ ప్రకటనలో రష్యాలో బర్గర్ ధరలకు దెబ్బకు రెక్కలొచ్చాయి.ఇక సంస్థ చెప్పినట్లుగా రెస్టారెంట్లను పూర్తి స్థాయిలో మూసివేస్తారు అని భావించిన బర్గర్ ప్రియులు చివరి సారిగా దానిని టేస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారు ఒకరు ఇద్దరు కాదు..ఏకంగా ఆ దేశంలో ఉండే వారు అంతా కూడా మెక్ డోనాల్ట్ రెస్టారెంట్ల ముందు వాలిపోయారు.
ఆ సంస్థకు చెందిన అవుట్ లెట్ల దగ్గర బర్గర్ అభిమానులు ఓ రేంజ్ లో గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు.ఇక బర్గర్ తినాలి అని అనుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో ఒక్క సారిగా ఆ బర్గర్ ధరలకు దెబ్బలకు రెక్కలొచ్చాయి. వీటిని కంపెనీ కూడా క్యాష్ చేసుకునే పనిలో పడింది. బర్గర్ ల ధరలను గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా పెంచింది.ప్రస్తుతం రష్యాలో ఓ బర్గర్ కాంబో ధర వచ్చేసి 26 వేలుకు పైగా ఉంది.ఇక అది కూడా ఆన్లైన్ చేస్తే.. సదుర కంపెనీ డెలివరీ ఇస్తుంది. ధరలు ఇంతలా పెరిగినా కాని రష్యన్లు ఏమాత్రం తగ్గడం లేదు అని అంటున్నారు. తినాలి అనే సంకల్పంతో ఎంత అయినా కాని కొనేది కొనేదే అని వారు చెప్తున్నారు.ఇక ఒక విధంగా చెప్పాలంటే బర్గర్ కాంబోకి రష్యన్లు చెల్లిస్తున్న 26 వేలుతో ఇండియాలో ఓ మధ్యతరగతి కుటుంబం ఎటువంటి ఇబ్బందులు లేకుండా కనీసం 3 నెలలుకు పైగా బతకవచ్చని అక్కడ తెలిసిన వారు అంటున్నారు.