పుతిన్‌ గురించి అమెరికన్ ఇంటలిజెన్స్ షాకింగ్‌ రిపోర్ట్‌?

Chakravarthi Kalyan
రష్యా అధ్యక్షుడిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా.. ఆ ఫ్రస్ట్రేషన్‌ తోనే ఆయన ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నారా.. యుద్ధం మొదలు పెట్టిన  రెండు వారాలకు కూడా ఉక్రెయిన్‌ లొంగకపోవడంతో ఆయనలో అసహనం పెరిగిపోతోందా.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు తాను ఊహించిన విధంగా ముందుకు వెళ్లకపోవడం ఆయనలో ఫ్రస్టేషన్ పెంచుతోందా.. దీనిపై అమెరికా ఇంటలిజెన్స్ ఓ షాకింగ్ రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది.


రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫ్రస్టేషన్‌కు కారణాలను అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదిక బయటపెట్టింది. పుతిన్ కొంత కాలం క్రితం క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. అందులో భాగంగా ఆయనకు వైద్యులు కొన్ని స్టెరాయిడ్లు ఇచ్చారు. ఈ స్టెరాయిడ్ల కారణంగానే పుతిన్‌లో విపరీత ఆలోచనలు వస్తున్నాయని అమెరికన్ ఇంటలిజెన్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే.. ఉక్రెయిన్‌పై దాడితో పాటు అణ్వస్త్ర బలగాలను సన్నద్ధంగా ఉండాలని పుతిన్ చెప్పిన సంగతి తెలిసిందే.


పుతిన్ ఇలాంటి ప్రమాదకర ఆదేశాలు ఇవ్వడంలో ఇలాంటి స్టెరాయిడ్ల వాడకం కారణం కావచ్చని అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదిక చెబుతోంది. అంతే కాదు.. పుతిన్ ముఖంలో వస్తున్న మార్పులు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయట. దీనికి తోడు పుతిన్‌ ఎవరిని కలిసినా 13 అడుగుల టేబుల్ గ్యాప్ పెడుతున్నారు. ఇది కూడా అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు అమెరికా కూడా ఇలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడం కూడా సాధారణమే.


మరి ఇంతకీ నిజంగా పుతిన్ ఆరోగ్యంపై స్టెరాయిడ్లు దుష్ప్రభావం చూపుతున్నాయా.. లేక పుతిన్‌పై పిచ్చి వాడు అనే ముద్ర వేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందా అన్నది మాత్రం తెలియదు. అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదికపై ఇంకా రష్యా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అటు చూస్తే ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రారంభమై 17 రోజులవుతోంది. యుద్ధం వల్ల  సుమారు 2 కోట్ల మంది ఉక్రెయిన్ వాసులు  దేశం విడిచి వెళ్లారని ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: