హిజాబ్ వివాదంపై హై కోర్ట్ సంచలన తీర్పు.

VAMSI
కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలోని ఒక కాలేజీ లో మొదలైన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనాన్ని సృష్టించింది అనేది అందరికీ తెలిసిందే. ఒక మతంతో ముడిపడిన ఈ సమస్య కాస్తా... అన్ని మతాలకు పాకింది. దీనితో రాజకీయంగా అనేక వివాదాస్పద చర్చలకు కారణం అయింది ఈ హిజాబ్ వివాదం. ఈ కారణంగా కర్ణాటక రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు విద్యాసంస్థలు కూడా బంద్ చేశారు. అయితే ముస్లిం ల తరపున ఎందరో ఇది మేము మొదటి నుండి ధరిస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఎందుకు వివాదం చేస్తున్నారు అంటూ నానా రభస చేశారు. ఆ తర్వాత ఈ విషయంపై అనేక పిటిషన్ లు కోర్ట్ లలో వేయడం జరిగింది.

అయితే దేశంలోని ఏ కోర్ట్ కూడా ఈ విషయంపై చర్చించడానికి పిటిషన్ లను స్వీకరించలేదు. కర్ణాటక హై కోర్ట్  మాత్రమే ఈ విషయంపై తుది నిర్ణయాన్ని ప్రకటించాలి అని  స్పష్టం చేశాయి. దానితో కర్ణాటక హై కోర్టు ఇచ్చే తీర్పు కోసం ముస్లిం లు మరియు ఇతర మతాల వారు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే దానిపై ఈ రోజు కాసేపటి క్రితమే కర్ణాటక హై కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ తీర్పులో హై కోర్ట్ చాలా క్లియర్ గా స్కూల్స్ మరియు కాలేజ్ లలో విద్యార్థినులు మతానికి సబందించిన హిజాబ్ ను ధరించడం తప్పని సరి కాదు అని వెల్లడించింది. ఈ తీర్పును వెల్లడించింది వారిలో రితూ రాజ్ అవస్తో చీఫ్ జస్టిస్ కాగా, కృష్ణ దీక్షిత్, జే ఎస్ ఖాన్ ఖాజీ లు జస్తిక్ లుగా ఉన్నారు.

అయితే ఈ తీర్పు పట్ల ఎవరైనా ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తెరలేపినా కటినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతే కాకుండా ముందస్తుగా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరింది. అంతే కాకుండా ఈ తీర్పును ఇచ్చిన న్యాయమూర్తుల ఇంటి దగ్గర కూడా భారీ భద్రతను కల్పించినట్లు తెలిసింది. కర్ణాటక లోని ముఖ్య నగరాలు అన్నింటిలో హై అలెర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ తీర్పు నేపథ్యంలో ఈ రోజు విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: