స్పీకర్ కు ఆగ్రహం తెప్పించిన 3 బిజేపీ ఎమ్మెల్యేలు... మళ్ళీ సేమ్ సీన్ రిపీట్?

VAMSI
తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సభలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైనా సభలలో అధికార విపక్షాలకు వివాదాలు జరుగుతాయని తెలిసిందే. కొన్ని సార్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించిన విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం లాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు స్పీకర్. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణ అసెంబ్లీ సభలో జరిగింది. మొన్ననే అసెంబ్లీ నుండి రాజా సింగ్, రఘునందన్ రావ్ మరియు ఈటల రాజేందర్ లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లగా అక్కడ వీరికి నిరాశే ఎదురయింది. దీనితో వీరు ముగ్గురో తీవ్ర అసంతృప్తి చెందారు.
హై కోర్ట్ వీరికి క్లియర్ గా ఒక విషయాన్ని తెలియచేసింది. అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయబడిన విషయంలో పూర్తి బాధ్యత మీదే అని పైగా ఈ కేసు ఇక్కడ పనికిరాదు అని, మీరు ఏమైనా చెప్పుకునేది ఉంటే స్పీకర్ డ్సాగ్గరకు వెళ్లి చెప్పుకోండని ఉత్తర్వుఅల్ను జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వుల కాపీని తీసుకుని ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాడ రెడ్డిని కలిశారు ముగ్గురు ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ ని కలిసిన వెదురు కోర్ట్ నుండి ఉత్తర్వులు వచ్చాయి మమ్మల్ని సభకు అనుమతించండి అని కోరారు. అయితే స్పీకర్ పోచారం వీరిని కొన్ని ప్రశంలు అడిగారని తెలుస్తోంది. ఉత్తర్వ్యులు అందుకున్న స్పీకర్ అవి ఎప్పుడు వచ్చాయి అని ఎమ్మెల్యేలను అడుగగా, సోమవారం సాయంత్రం వచ్చాయని తెలియచేశారు ఎమ్మెల్యే రఘునందన్‌ రావు.
అలాగే ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అని స్పీకర్ అడుగగా  ఆ ముగ్గురు బిజెపి ఎమ్మేల్యేలు తమ వాదనలు వినిపిస్తూ విషయాన్ని వివరించడానికి ప్రయత్నించారు. రాయితీ ఈ పూర్తి సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురూ ఏది ఏమైనా తాము తమ తమ స్థానాల ను విడిచిపెట్టేది లేదని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. మరి దీనిపై ముందు ముందు ఇంకేమి జరగనుందో చూడాలి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: