పవన్ స్పీచ్ పిట్టల దొర ప్రసంగంలా ఉంది: కాంగ్రెస్ నేత..
అంతేకాదు అదే సభలో రాహుల్ గాంధీ పై తీవ్ర విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అన్నారు.భాజపా చేతిలో పవన్ కల్యాణ్ కీలుబొమ్మ అని తులసిరెడ్డి ఆరొపించారు. రాష్ట్రం ఇలా మరదానికి ముఖ్య కారణం బీజెపి అని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసింది బీజెపి అని ఆయన అన్నారు.భాజపా ఇచ్చే రోడ్మ్యాప్తో ముందుకుపోతానని పవన్ కల్యాణ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వచ్చే ఎన్నికలలో వైసిపి ని గద్దె దించుతామని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముందు వైసిపి చేస్తున్నా వెన్నుపోటును తట్టుకో వాలి అని ధ్వజమెత్తారు. అన్నీ దొంగ పార్టీలకు త్వరలోనే కాంగ్రెస్ బుద్ది చెబుతుందని ఆయన అన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సభ నిర్వహించిన అధినేత పవన్ సుదీర్ఘంగా దాదాపుగా అన్ని పార్టీల నేతలకు, అన్ని వర్గాల ప్రజలకూ ధన్యవాదాలు తెలియజేశారు.. మొత్తానికి పవన్ పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.. ఇది ఎంతవరకు వెళుతూందో చూడాలి..