గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ పై రూ. 300 వరకు ఆదా?

praveen
గత కొన్ని రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా పెరిగిపోయిన ధరలు సామాన్యులపై గుదిబండలా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో ఇక గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి అన్న వార్త ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అందరి చూపులు అటు వైపే వెళ్తున్నాయి. ఇకపోతే ఇలా గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో  సామాన్యుల ఇబ్బందులు తారా స్థాయికి చేరుకున్న సమయంలో ఇక ఇప్పుడు అందరికీ ఉపశమనం కలిగించే వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది.


 ఇక నుంచి గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై తీసుకునే వినియోగదారులు అందరూ కూడా ప్రతి సిలిండర్ కొనుగోలు పై 300 రూపాయల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. ఇక ఈ నిర్ణయంతో అటు సామాన్య ప్రజలందరికీ కూడా ఎంతగానో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అని చెప్పాలి. గత కొన్ని నెలల క్రితం డోమెస్టిక్ ఎల్పిజి  గ్యాస్ సిలిండర్ ధర 594 రూపాయలు లభించేది. ఇక ఈ ధర సామాన్యులకు అందుబాటులో ఉండేది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ ధర కాస్త 884 రూపాయలకు పెరిగింది. ఇలా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారూ.


 అందుకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కొనుగోలు చేసిన వారికి 300 రూపాయలు అందిస్తున్నారు. ఇక దీనికోసం వారు తమ సబ్సిడీ ఖాతాతో ఆధార్ కార్డుతో లింకు చేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపులు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక మునుపటి కంటే ఎక్కువ ఇప్పుడు సబ్సిడీ కస్టమర్లకు లభించపోతుంది అని తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా సిలిండర్ల కొనుగోలు పై వచ్చే సబ్సిడీ 20 నుంచి 30 రూపాయలకు మాత్రమే ఉంది. ఇక ఇప్పుడు మళ్లీ దానిని దాదాపు మూడు వందల రూపాయలకు పెంచారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి సబ్సిడీ ప్రయోజనం పొందనున్నారు. ఇక ఈ ప్రయోజనం పొందాలంటే వీలైనంత త్వరగా మీ సబ్సిడీ బ్యాంకు ఖాతా కు మీ ఆధార్ కార్డు లింక్ చేయడం ఎంతో ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gas

సంబంధిత వార్తలు: