"పెట్రోల్ - డీజిల్" ధరల్లో స్వల్ప మార్పులు...

VAMSI
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏ ముహూర్తాన మొదలు అయింది కానీ ఇండియాలో నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు అధికారికంగా పెరగకపోయినా స్థానిక కిరాణా షాపు వ్యాపారులు స్వలాభం కోసం పాత ఆయిల్ ధరలకు బదులుగా పెరిగినట్లు స్టిక్కర్ లను అంటించి దోపిడీలకు పాల్పడిన విధానాన్ని విజిలెన్స్ తనిఖీలు జరిపి వారిపై తగిన చర్యలు తీసుకున్నారు. అయితే ఇందుకు అనుగుణంగానే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగనున్నాయని కొద్ది రోజుల నుండి అంతర్జాతీయంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే పెద్దగా వీటి ధరలలో మార్పులు లేవని ఈ రోజు ఉదయమే విడుదల చేసిన భారతదేశంలోని చమురు కంపెనీలు ధరలను బట్టి తెలుస్తోంది.

మామూలుగా ప్రతి రోజు ఉదయం దేశ వ్యాప్తంగా ఉన్న ఆయిల్ కంపెనీలు ప్రధాన నగరాలలో ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బట్టి స్థానికంగా మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు నిర్ణయిస్తారు. అదే విధంగా ఈ రోజు ప్రకటించిన ధరలను బట్టి చూస్తే ఎటువంటి మార్పు లేదు అని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు వ్యాట్ దర తగ్గించి అమ్ముతుండడం వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది. పెద్ద నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో హెచ్చు తగ్గులు ఉన్నట్లు తెలుస్తోంది.

దానిని బట్టి చూస్తే  హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20 , డీజిల్ ధర రూ. 94.62 గా ఉన్నాయి. కరీంనగర్ లో పెట్రోల్ రూ. 108.38 మరియు డీజిల్ రూ. 94.69 గా ఉన్నాయి. వరంగల్ లో  పెట్రోల్ రూ. 107.69 మరియు డీజిల్ రూ. 94.14 గా ఉంది. ఇక ఆంద్ర ప్రదేశ్ లోని విజయవాడ లో పెట్రోల్ రూ. 110.91 మరియు డీజిల్ ధర రూ. 95.51 , విశాఖపట్నం లో పెట్రోల్ ధర రూ. 109.40 మరియు డీజిల్ ధర రూ. 95.51 ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీ లో పెట్రోల్ రూ. 95.41 మరియు డీజిల్ రూ. 86.67 గా ఉన్నాయి. ముంబై లో  పెట్రోల్ రూ. 109.98 మరియు డీజిల్ రూ. 94.14 గా ఉంది. ఇలా ఈ రోజు చమురు ధరలు దేశ వ్యాప్తంగా ఉన్న తగ్గాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: