వంట నూనె ధరలకు ఏపీ సర్కార్ బ్రేక్..
దీంతో అధికధరల విక్రయానికి చెక్ పెట్టొచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలను కూడా వాటిని చౌకధరల దుకాణాల్లో కొనాలని సూచించింది. ఇకపై నూనె వ్యాపారులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అలాగే అక్రమంగా నిల్వ చేసే వారిపై కేసులు నమోదు చేసి వారి వద్ద ఉన్న స్టాకును కూడా స్వాధీనం చేసుకుని తక్కువ ధరకు విక్రయించనున్నారు. అంతేకాదు హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు ఇంకా అలాగే రిఫైనరీదారులు కేంద్రప్రభుత్వ వెబ్ పోర్టల్‌కు లోబడి స్టాక్ పరిమితిని పాటిస్తున్నారో లేదో చెకింగ్ లు చేయనున్నారు అధికారులు.
ఇక రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి రోజు కూడా సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.రీసెంట్ కాలంలో కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వంట నూనె ధరలకు బ్రేక్ వేసేందుకు వంట నూనెపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించింది. అయినప్పటికీ కొంత మంది కావాలనే ధరలు పెంచి మరీ ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని గుర్తించి, ఇక ఎమ్మార్పీ రేట్లకే విక్రయించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.
డీలర్ల వద్ద పాత స్టాక్ ఉంటే దాన్ని పాత ధరలకే అమ్మాలని కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది.. ఈ కమిటీ ఏప్రిల్ 15 వ తేదీ వరకు ప్రతిరోజు వంట నూనె ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఇంకా అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.