రాజుగారికి రూట్ క్లియర్..జనసేనలోకే?
అయితే రఘురామ, చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారని, చంద్రబాబు మనిషి అంటూ వైసీపీ ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉంది. అలాగే ఆయన టీడీపీలో చేరిపోతారని ప్రచారం చేశారు. ఆ మధ్య రఘురామ తన పదవికి రాజీనామా చేసేసి...వేరే పార్టీలో చేరతారని చెప్పిన విషయం తెలిసిందే..అంటే ఆయన బీజేపీలోనే చేరతారని అంతా అనుకున్నారు...కానీ ఆయన పదవికి రాజీనామా చేయలేదు...వేరే పార్టీలో చేరలేదు.
ఇటీవల ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలని బట్టి చూస్తే రఘురామకు కొత్త రూట్ దొరికిందని చెప్పొచ్చు...ఎలాగో ఆయన టీడీపీ, జనసేనలకు అనుకూలంగానే ఉన్నారు...అలాగే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే వైసీపీని నిలువరించడం సాధ్యం అవుతుందని భావించారు..కానీ ఇంతకాలం పొత్తు గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు. అయితే ఇటీవల చంద్రబాబు పొత్తుకు రెడీగా ఉన్నానని పరోక్షంగా చెప్పారు...తాజాగా పవన్ కళ్యాన్ సైతం పొత్తుకు రెడీ అన్నట్లే చెప్పారు. దీంతో టీడీపీ-జనసేనల పొత్తు దాదాపు ఖాయమనే అంతా అనుకుంటున్నారు.
అలాగే పొత్తు ఫిక్స్ అవుతుంది కాబట్టి రఘురామ జనసేనలో చేరే అవకాశం ఎక్కువ ఉంది..ఎందుకంటే పొత్తులో భాగంగా జనసేనకు నరసాపురం ఎంపీ సీటు రావడం పక్కా..పైగా అక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేదు...కాబట్టి రఘురామ జనసేనలో చేరి టీడీపీ మద్ధతుతో నరసాపురం బరిలో దిగుతారని తెలుస్తోంది. చూడాలి మరి రఘురామ జనసేన రూట్ లోకి వెళ్తారో లేదో.