ఎమ్మెల్యే రాజా సింగ్: కేసీఆర్ "ఇదే ఆఖరి ఛాన్స్"... నెక్స్ట్ ఎలక్షన్ లో చిత్తు చిత్తు
అలాంటి నాయకులలో తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకరు. ఇపుడు తాజాగా మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. రీసెంటుగా విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ పై కేటీఆర్ ను ప్రశ్నించారు. రాజా సింగ్ మాట్లాడుతూ తెలంగాణాలో మొత్తం 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉంటే 80 వేలు ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణం. మీరు అధికారంలో ఉన్న ఏడు సంవత్సరాలలో 700 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఈ కుటుంబాలకు ఏమి చేయనుందో చెప్పాలి. ఇక కేంద్రంపై కేసీఆర్ ఉద్యోగాల విషయంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియడం లేదు.
ప్రతి సంవత్సరం కేంద్రం తన బాధ్యతగా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఎన్డీఏ లలో ఉద్యోగాలను ఇస్తోంది. కేటీఆర్ బండి సంజయ్ కు సవాల్ విసరడం కాదు, ఈ సవాలులో గెలవడానికి బీజేపీ సామాన్య కర్త సరిపోతాడు. తెరాస కు ఇదే ఆఖరి అధికారం.. వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తాము. కేటీఆర్ కు పట్టిన బలుపు అంత దిగేలా చేస్తాము. పై విధంగా రాజా సింగ్ తెరాస ను మరియు కేటీఆర్ కేసీఆర్ లపై రెచ్చిపోయారు.