నెల్లూరు నుండి ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కంఫర్మ్ ?
సిఎం జగన్ తాజాగా పార్టీలో నాయకులకు సూచిస్తున్న గడప గడపకు వైసిపి అనే చైతన్య కార్యక్రమం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండేళ్ల ముందు నుండే పాటిస్తూ కార్యకర్తలతో అమలు చేయిస్తున్నారు. ప్రజా బలం అధికంగా ఉన్న ఈ నాయకుడికి ఇపుడు మంత్రి పదవి దక్కడం గ్యారంటీ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రత్యర్ధి పార్టీల పై కౌంటర్లుకు రీ కౌంటర్లు ఇవ్వడం లోనూ ఈ నాయకుడు ఎపుడు ముందే ఉంటారు. గత రెండేళ్లుగా అధికార పార్టీలో కీలక బాధ్యతలు పోషిస్తున్న ఈ నాయకుడు ప్రజల మనసును గెలుచుకున్న రాజకీయవేత్తగా, వారి మనసు తెలుసుకున్న నాయకుడిగా అందరి మన్నలను పొందారు శ్రీధర్ రెడ్డి.
అలాంటి వ్యక్తికి ఇపుడు మంత్రి పదవి దక్కడం అంటే న్యాయమే అంటూ కొందరు నేతలు అభిప్రాయపడుతుండగా మరి కొందరు నాయకులు మాత్రం తమకు మంత్రి పదవి దక్కాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఉందా? ఒకవేళ మంత్రి పదవి దక్కితే ఏ శాఖ ఇవ్వనున్నారు అన్న పూర్తి వివరాలు తెలియాలంటే ఉగాది వరకు వెయిట్ చేయక తప్పదు.