ప్రయాణికులకు షాక్ ఇచ్చిన TS ఆర్టీసీ ఎండీ సజ్జనార్?

VAMSI
తెలంగాణ ప్రభుత్వంలో పోలీస్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ కు పనితీరులో ఎంతటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే అతని సేవలను వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సజ్జనార్ ను TSRTC కి ఎండీ ని చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఒక నిజాయితీ కలిగిన అధికారి ఎక్కడ పనిచేస్తున్నాము, ఏ శాఖలో ఉన్నాము అన్నది చేసుకోరు. ఎక్కడైనా ప్రజలకు 100 శాతం న్యాయం చేయాలని సంస్థ అభివృద్ధి చెందాలని పాటు పడతారు. అదే స్థాయిలో కష్టపడుతారు. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కూడా లాభాల్లో ఉందని వినికిడి. అయితే కరోనా కారణంగా నష్టాలను పూడ్చడానికి సజ్జనార్ ఎన్ని పధకాలను తీసుకువచ్చారు.  

తాజాగా ఆర్టీసీ కోసం కొత్త టికెట్ ధరలను తీసుకువచ్చాడు. ఇది చిల్లర కోసం అటు ప్రజలు ఇటు కండక్టర్ లు ఇబ్న్నది ఆపడకుండా రూపుమాపుతుందేశాని తెలుస్తోంది. ప్రయాణికులు ఈ టికెట్ల ధరల వివరాలు తెలుసుకోండి. టికెట్ల ధరలలో హెచ్చు తగ్గులు జరిగాయి. TSRTC టికెట్ల రేట్ల విషయంలో కీలక మార్పులు చేసింది.  టోల్ ఛార్జీలు భారం తగ్గింపు కొరకు TSRTC చర్యలు చేపట్టింది. టోల్ చార్జీల కింద ఆర్డినరీ బస్సులలో రూ. 1 అలాగే సూపర్ లక్సరి మరియు ఏసి బస్సులలో రూ.2 లను పెంచారు ఈ పెంచిన ధరల ప్రకారం రూ 1, మరియు రూ.2 లను అదనంగా ప్రయాణికుల నుండి వసూలు చేయనుంది TSRTC. పెరిగిన మార్పులు చేసిన కొత్త ధరలు నేటి నుండి అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది.

అదే విధంగా ప్రయాణికులకు చిల్లర సమస్యలు తలెత్తకుండా పల్లె వెలుగు బస్సులలో ఛార్జీ లలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. రూ.12 టికెట్టు ధరను రూ. 10 లకు తగ్గించడం జరిగింది. అదే విధంగా రూ.13 మరియు రూ. 14 లను రూ.1 పెంచి రూ. 15 లకు పెంచారు. 80 కిలోమీటర్లకు రూ.67 ఉన్నటువంటి చార్జీని  రూ. 65 లకు తగ్గించారు. ఇలా చార్జీలలో మార్పులు చేయడం ద్వారా చిల్లర లేక వెతుక్కోవాల్సిన శ్రమ తగ్గించామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: