టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఏం జరిగిందంటే?

praveen
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు ఎంతలా రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెక్నాలజీని మంచి పనుల కోసం కాకుండా  చెడు పనుల కోసం ఉపయోగిస్తున్నారు.  ఎంతోమందినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాని తమ ఆయుధంగా మార్చుకుంటూ ఎన్నో ఖాతాలను హ్యాక్ చేయడం ఇక ఆ ఖాతాల ద్వారా చిత్ర విచిత్రమైన మెసేజ్లు పంపి ఎంతోమందిని బురిడీ కొట్టించి డబ్బులు దండుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇది సామాన్య ప్రజలకు మాత్రమే కాదు రాజకీయ పార్టీలకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు తప్పడం లేదని తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఎంతో మందికి చేరువ అవుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కూడా మరింత రెచ్చిపోతున్నారు.


 ఈ క్రమంలోనే అటు ప్రముఖ రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ పార్టీ కార్యాచరణను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ కార్యకర్తలు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే అక్క ఆయా పార్టీల సోషల్ మీడియా అకౌంట్లకు హ్యాకర్స్ బెడద వెంటాడుతూనే ఉంది. ఇటీవలే ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం కాస్త సంచలనంగా మారిపోయింది.


 ట్విట్టర్ ఖాతాకు టిడిపి పేరుకు బదులు ఎలాన్ మస్క్ పేరును మార్చి చిత్రవిచిత్రమైన ట్వీట్లు పెట్టడం కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన టీడీపీ సోషల్ మీడియా విభాగం తమా అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది అన్న విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇక ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక హ్యాక్ అయిన టీడీపీ అఫీషియల్ ఖాతా నుండి ఏవైనా పోస్టులు వస్తే కార్యకర్తలు ఎవరు నమ్మి మోసపోవద్దు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: