'RRR' దేశం గర్వించే సినిమా అన్న సీఎం?

Chakravarthi Kalyan
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో రాజమౌళి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారని ఆయన కొనియాడారు. రాజమౌళి ఒక సృష్టికర్త అన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ దేశ గర్వించే సినిమా అవుతుందన్నారు. దేశాన్ని ప్రేమించే వారంతా ఈ సినిమాను టికెట్‌ కొనుక్కొని థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలని సీఎం బసవరాజ్‌ బొమ్మై పిలుపునిచ్చారు.


భాషల గురించి ప్రస్తావించిన బస్వరాజ్‌ బొమ్మై.. ప్రాంతీయ భాషలన్నీ అక్కాచెల్లెళ్లలాంటివని గుర్తు చేశారు. అలా ఉండటమే  మన సంస్కృతి అన్న బొమ్మె.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఘన విజయం సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలన్నారు. ఎస్ ఎస్ రాజమౌళి తన సినిమాలతో చరిత్ర లిఖించి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేశారని కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై తెలిపారు.


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిక్‌బళ్లాపూర్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌కు  ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం బస్వరాజ్‌ బొమ్మై ఆర్ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌ ఎస్‌ రాజమౌళి సాధారణ సినిమా మేకర్‌ కాదని... రాజమౌళి ఒక క్రియేటర్‌ అని మెచ్చుకున్నారు.


అదే సమయంలో  రామ్‌చరణ్‌‌, తారక్‌, శివరాజ్‌కుమార్‌ల స్నేహం గురించి కూడా కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మె.. బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల బంధంలా రామ్‌చరణ్‌‌, తారక్‌, శివరాజ్‌కుమార్‌ల స్నేహం కొనసాగాలని కోరుకున్నారు. ఈ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను స్వాతంత్ర్య సమరయోధులైన భగత్‌ సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌లకు అంకితం ఇవ్వాలని సూచించారు. కిత్తు రాణి చెనమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయ్‌లకు కూడా ఈ సినిమాను అంకింతమివ్వాలని తాను కోరుకుంటున్నానని డైరెక్టర్ రాజమౌళి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: