కాసుల వర్షం కురిపిస్తున్న చలాన్లు.. ఎంత వసూలయ్యాయో తెలుసా?
ఇలా ఇటీవలి కాలంలో ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానానాలు పెరిగిపోయాయని చెప్పాలి. కానీ అటు జరిమానాలు పెరిగిపోతున్న వాహనదారులు మాత్రం పెండింగ్లో ఉన్న చలనాలను కట్టేందుకు ఎక్కడ ముందుకు రాలేదు. కోట్ల కోట్ల రూపాయలు పెండింగ్ చలాన్లు అలాగే ఉండిపోయాయ్. ఇలాంటి సమయంలోనే అటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఐడియా తో ముందుకు వచ్చారు. ఏకంగా పెండింగ్లో ఉన్న చలాన్లు వాహనదారులు అందరూ చెల్లించే విధంగా భారీగా డిస్కౌంట్ ప్రకటించారు. ఏకంగా 75 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో వాహనదారులు తమ చలానా చెల్లించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
ఈ నెల 1 నుంచి 31 వరకు కూడా ఇక హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ డిస్కౌంట్ ప్రకటన చేశారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి 1 నుంచి 20 వరకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏకంగా కోటి ఇరవై లక్షల చలాన్లు క్లియర్ అయినట్లు తెలుస్తుంది. దీంతో దాదాపు 113 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధి నుంచి ఏకంగా 64 కోట్లు చలాన్లు క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఇక తద్వారా 49.6 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయట. ఇలా పోలీసులు చేసిన వినూత్నమైన ఆలోచన ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుంది అని తెలుస్తోంది..