ఎగుమతుల్లో భారత్ మరో మైల్ స్టోన్.. మోడీ ప్రశంసలు!

Purushottham Vinay
భారత దేశం ఎగుమతుల విషయంలో మరో మైలు రాయిని అందుకుంది. నిర్దేశించుకున్న సమయం కంటే ముందుగానే ఎగుమతుల విషయంలో భారత్ లక్ష్యాన్ని సాధించింది.ఇక భారతదేశం తన అత్యధిక వస్తువుల ఎగుమతి లక్ష్యం $400 బిలియన్లుగా పెట్టుకుంది. అయితే, షెడ్యూల్ కంటే తొమ్మిది రోజుల ముందే దానిని సాధించింది. బుధవారం నాడు అత్యధిక వస్తువుల ఎగుమతి లక్ష్యం USD 400 బిలియన్లను భారత్ సాధించింది. 400 బిలియన్ డాలర్ల వస్తువుల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడంలో దేశం సాధించిన విజయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో ప్రశంసించారు.



ఇది భారతదేశ 'ఆత్మనిర్భర్ భారత్'  ప్రయాణంలో గొప్ప మైలురాయి అని అన్నారు.వస్తువుల ఎగుమతుల్లో సరికొత్త మైలురాయిని భారత దేశం అందుకున్న విషయాన్ని ప్రస్తావించిన ప్రధాన మంత్రి మోడీ.. "భారత్ $400 బిలియన్ల వస్తువుల ఎగుమతుల ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. ఇక ఈ విజయానికి కారణమైన మా రైతులు, నేత కార్మికులు, MSMEలు, తయారీదారులు ఇంకా అలాగే ఎగుమతిదారులను నేను అభినందిస్తున్నాను.అలాగే మన ఆత్మనిర్భర్ భారత దేశం ప్రయాణంలో ఇది కీలకమైన మైలురాయి. #LocalGoesGlobal." అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇక భారతదేశ అత్యధిక ఎగుమతుల లక్ష్యాన్ని ఉద్దేశించిన గడువు కంటే తొమ్మిది రోజుల ముందుగానే సాధించిన విషయాన్ని వెల్లడించే గ్రాఫిక్స్ ఫోటోలను పోస్ట్ చేశారు.ఇక సగటున, ప్రతి గంటకు కూడా USD 46 మిలియన్ వస్తువులు ఎగుమతి చేయబడతాయని అందులో పేర్కొన్నారు. ఇంకా అలాగే, ప్రతిరోజు కూడా USD 1 బిలియన్ వస్తువులు ఇంకా అలాగే ప్రతి నెల USD 33 బిలియన్ల విలువైన వస్తువులు ఎగుమతి చేయబడతాయని ఆ ఫొటోస్ పేర్కొన్నాయి. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 292 బిలియన్ డాలర్లు కాగా ఇంకా 2021-22లో ఎగుమతులు 37 శాతం వృద్ధితో 400 బిలియన్ డాలర్లకు చేరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: