బరితెగించిన కర్నూల్ పోలీస్.. లక్షలు కొట్టేసాడు!

Purushottham Vinay
పోలీసుల అవినీతి రోజు రోజుకి హద్దులు దాటుతోందనే చెప్పాలి. కేవలం లంచగొండితనమే కాదు ఇంకా పట్టుబడ్డ సొమ్మునూ కూడా హాంఫట్‌ చేసేస్తున్నారు పోలీసులు.ఇక అక్రమ సొమ్ముతో పోలీసులు కోట్లకు పడగలెత్తుతున్నారు. అలాగే నిబంధనలకు నీళ్లొదులుతున్నారు కర్నూలు జిల్లా పోలీసులు. ఓ సీఐ అవినీతి బాగోతం తాజాగా బట్టబయలైంది. కర్నూలుకి చెందిన సీఐ బరితెగించాడు. ఏకంగా ఎస్పీ పేరు చెప్పి అప్పనంగా లక్షల డబ్బులు కొట్టేశాడు. తీరా గుట్టురట్టవడంతో పాపం పత్తాలేకుండా పోయాడు.కర్నూలు శివార్లలోని పంచలింగాల చెక్‌పోస్ట్‌ దగ్గర ఈనెల 19 వ తేదీన భారీగా నగదు పట్టుబడింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో హైదరాబాద్ నుంచి తమిళనాడు రాష్ట్రానికి 75 లక్షలు తీసుకెళ్తున్న బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు SEB అధికారులు. ఇక ఆ నగదుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఓ పద్ధతి ప్రకారం కేసును తాలూకా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించడం జరిగింది.



ఇక ఇక్కడే మొదలైంది అసలు ఈ హై డ్రామా. ఈ సీన్‌లోకి వచ్చిన.. తాలూకా సీఐ కంబగిరి రాముడు బరితెగించి అత్యాశకు పోయాడు. ఇక రెండు రోజులు ఆగి అన్ని రశీదులూ తీసుకొచ్చిన బాలకృష్ణ.. ఆ డబ్బు తిరిగివ్వాలని సీఐని కోరాడు. డబ్బు తిరిగిచ్చేందుకు నిరాకరించిన సీఐ రాముడు ఇంకా మరిన్ని ప్రూప్స్‌ కావాలని బాగా పట్టుబట్టాడు. అంతేకాకుండా కొంత నగదును ఎస్పీకి ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు.ఇక పట్టుబడ్డ 75 లక్షల్లో బాలకృష్ణకు కేవలం 60 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నాడు ఈ సీఐ. మిగతా 15 లక్షల డబ్బుని నొక్కేశాడు.ఇక ఈ విషయాన్ని బాలకృష్ణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అతని అసలు రంగు బయటపడింది.ఇక దీనిపై ఎస్పీ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించారు.



డబ్బు తీసుకుంది నిజమేనని తేలడంతో సీఐ కంబగిరి రాముడుపై దెబ్బకు కేసు నమోదైంది. ఆ విషయం తెలుసుకున్న సీఐ.. దెబ్బకు పరారయ్యాడు. ఇక అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. ఇదే కంబగిరి రాముడు నంద్యాలలో కూడా పనిచేసి సస్పెండయ్యాడు. డోన్‌లో పనిచేస్తున్న సమయంలో కూడా పలు ఆరోపణలున్నాయి.ఇక ఇదిలా వుంటే, దీనిపైనా జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ విజయవాడకు పరారైనట్లు సమాచారం తెలుస్తోంది. సీఐని పట్టుకునేందుకు రెండు పోలీస్ టీంలు రంగంలోకి దిగాయి. గతంలో కూడా ఇలా SEB అధికారులు డబ్బులు పట్టుకున్న ఘటనలో ముడుపులు తీసుకుని వదిలేసినట్లు పలు ఆరోపణలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: